అభిమాని కూతురు పెళ్లికి మెగా సాయం

Update: 2022-02-02 06:30 GMT
మెగాస్టార్‌ చిరంజీవి తన అభిమానులు కష్టంలో ఉన్న సమయంలో ఖచ్చితంగా ముందు ఉండి సాయం చేస్తాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. గడచిన మూడు దశాబ్దాలుగా అభిమానులకు చిరంజీవి చేసింది ఎంతో ఉంది. చిరంజీవి అభిమాన సంఘాలు సమాజ సేవలో భాగంగా బ్లడ్ బ్యాంక్‌.. ఐ బ్యాంక్‌ ఇటీవల ఆక్సీజన్ బ్యాంకులు ఏర్పాటు చేసిన విషయం తెల్సిందే. తన అభిమానులు చేస్తున్న సేవకు వారికి కూడా తన వంతు సహకారంను చిరంజీవి అందిస్తూ ఉంటాడు.

తన అభిమాన సంఘం నాయకుల కుటుంబాల్లో జరిగే ఫంక్షన్స్ కు హాజరు అవ్వడం మొదలుకుని ఎవరైనా అభిమాని ఆర్థికంగా ఇబ్బంది ఎదుర్కొంటే వారికి సాయంగా నిలిచే వరకు ఎన్నో విషయాల్లో చిరంజీవి అభిమానులతో మమేకం అవుతూనే ఉంటాడు. తాజాగా మరోసారి చిరంజీవి తన మంచి మనసును చాటుకుని అభిమానికి అండగా నిలబడి తన మెగా సాయంను అందించాడు.

చిరంజీవికి సుదీర్ఘ కాలంగా అభిమాని అయిన రాజాం కొండలరావు కూతురు పెళ్లి చేస్తున్న విషయం తెలుసుకున్న మెగాస్టార్‌ చిరంజీవి తనవంతు బాధ్యతగా సాయంగా లక్ష రూపాయలను పంపించాడట. ఈ విషయాన్ని మెగాస్టార్‌ చిరంజీవి ఆల్‌ ఇండియా అభిమాన సంఘం నాయకుడు మరియు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌ వ్యవహార కర్త అయిన రావణం స్వామి నాయుడు చెప్పుకొచ్చారు. ''లక్షణనమైన పెళ్లికూతురు నీలవేణి కి  మెగాస్టార్ ఆశీస్సుల లక్ష రూపాయలు విరాళం. రాజాం కొండలరావు గారు మొదట్నుంచీ  శ్రీ చిరంజీవి గారి వీరాభిమాని.ఆయన కూమార్తె నీలవేణి  పెళ్లి కుదిరింది. సమాచారం అందుకున్న @KChiruTweets గారు లక్షరూపాయల ఆర్ధిక  చేయూతనిచ్చి పెళ్లి సజావుగా జరిపించమన్నారు....'' అంటూ స్వామి నాయుడు ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.

చిరంజీవి అభిమానులకు ఇలా రెగ్యులర్ గా తన వంతు సాయం అందిస్తూ వారి కష్టాలను పంచుకుంటూ ఆనందాల్లో భాగస్వామ్యం అవుతూ వస్తున్నారు. అందుకే మెగాస్టార్‌ అంటే ఇప్పటికి కూడా లక్షల మంది పడి చస్తారు అనడంలో సందేహం లేదు. హీరోగా సుదీర్ఘ కాలం ఇంతటి అభిమానం దక్కించుకున్న కొనసాగించుకుంటున్న హీరో అంటే ఖచ్చితంగా మెగాస్టార్ చిరంజీవి మాత్రమే అనడంలో సందేహం లేదు. ఇక చిరంజీవి సినిమాల విషయానికి వస్తే ఆచార్య షూటింగ్‌ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దంగా ఉంది.

 కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమా భారీ అంచనాల నడుమ రూపొందిన విషయం తెల్సిందే. మరో వైపు గాడ్‌ ఫాదర్‌.. భోళా శంకర్ సినిమాలతో పాటు బాబీ దర్శకత్వంలో ఒక సినిమాను కూడా చిరంజీవి చేస్తున్నాడు. ఈ మూడు సినిమాలు మాత్రమే కాకుండా వెంకీ కుడుముల దర్శకత్వంలో త్వరలో మరో సినిమాను కూడా పట్టాలెక్కించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాబోయే రెండేళ్లలో చిరంజీవి నుండి అయిదు ఆరు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తాయి
Tags:    

Similar News