మెగా హీరో లాంచ్ .. తెర‌పైకి నేపోటిజం

Update: 2021-02-08 02:30 GMT
డెబ్యూ సినిమా .. పైగా తొలి ఈవెంట్ వేదిక‌.. స్పీచ్ ఇవ్వాలంటే ఎవ‌రైనా త‌డ‌బ‌డ‌తారు. కానీ మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్ మాత్రం ఎక్క‌డా జంకు అన్న‌దే లేకుండా టాప్ టు బాట‌మ్ అన్ని పేర్లు చ‌దివేస్తూ అద్భుత‌మైన స్పీచ్ ఇచ్చాడు ఉప్పెన వేదికపై. మెగాస్టార్ చిరంజీవి స‌మ‌క్షంలో తేజ్ తొలి ఈవెంట్ అయినా త‌డ‌బ‌డ‌క `మామా..` అంటూ మెగాభిమానుల్ని ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాడు.

అన్న‌ట్టు తేజ్ మాట్లాడుతున్నంత‌సేపూ ఆ స్పీచ్ వింటున్న ఆడియెన్ నుంచి స్పంద‌న అంతే ఇదిగా ఉంది. బెస్ట్ డెబ్యూ స్పీచ్.. టాలీవుడ్ కి మ‌రో మంచి హీరో దొరికాడు.. అంటూ పొగిడేశారు చాలామంది.

ఇప్ప‌టివ‌ర‌కూ ఇలాంటి డెబ్యూ స్పీచ్ విన‌లేద‌ని ప్ర‌శంస‌లు కురిపించారు. టాలీవుడ్ లో అత‌డికి మంచి భ‌విష్య‌త్ ఉంద‌ని ధీవించేశారు. మెగా హౌస్ లో మ‌రో భ‌విష్య‌త్ స్టార్ అంటూ కొనియాడారు.

కొంద‌రైతే నెప్టోయిజం (న‌ట‌వార‌స‌త్వం) అనేదానిని మేం న‌మ్మం. మంచి ప్ర‌తిభావంతుడిని ఎవ‌రూ ఆప‌లేరు అని వ్యాఖ్యానించారు. మెగా ఫ్యామిలీలో టీమిండియాలా 11 మంది ప్లేయ‌ర్లు ఉన్నా.. ఈ న‌ట‌ వార‌సుడికి ఆరంగేట్రం సులువు ఏమో కానీ ఎద‌గ‌డం అంత ఈజీ కాద‌ని అన్నారు.

ఇక లైట్ మ‌న్ డ్రైవ‌ర్ నుంచి .. అసిస్టెంట్ డైరెక్ట‌ర్ల నుంచి కోస్టార్ల వ‌ర‌కూ ఎవ‌రినీ విడిచిపెట్ట‌కుండా వైష్ణ‌వ్ తేజ్ గుర్తు చేసుకున్నాడు. దీంతో చాలామంది అత‌డి డౌన్ టు ఎర్త్ నేచుర్ మావ‌య్య చిరంజీవిలానే ఉంది అంటూ పొగిడేసారు. ఆస‌క్తిక‌రంగా ఇదే వేదిక‌పై క‌థానాయిక కృతి శెట్టి తెలుగు మాట్టాడి శ‌భాష్ అనిపించింది. క్యూట్ గా మెచ్యూర్డ్ గా స్పీచ్ ఇచ్చి ప్ర‌శంస‌లు అందుకుంది. కృతికి బోలెడంత భ‌విష్య‌త్ ఉందంటూ మెగాభిమానులు దీవించేశారు.




Tags:    

Similar News