టాలీవుడ్ ఇండస్ట్రీ పైకి లాభాల బాటలో నడుస్తున్నట్టుగా కనిపిస్తున్నా.. పాన్ ఇండియా సినిమాలతో హడావిడి చేస్తున్నా ఆర్థిక సమస్యలతో సాటు ఇతర సమస్యలతో సతమతమవుతోంది. వీటితో పాటు పెరిగిన టికెట్ రేట్ల కారణంగా థియేటర్లకు ప్రేక్షకులు దూరం కావడం కూడా టాలీవుడ్ ప్రొడ్యూసర్లని తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. ఓటీటీల కారణంగా కూడా ఇబ్బందులు ఎదుర్కుంటున్న నేపథ్యంలో యాక్టీవ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆగస్టు 1 నుంచి సినిమా షూటింగ్ లని బంద్ చేస్తున్నట్టుగా ప్రకటించిన విషయం తెలిసిందే.
అయితే గిల్డ్ ప్రొడ్యూసర్ల నిర్ణయంపై మిగతా ప్రొడ్యూసర్లు భిన్నభిప్రాయాలని వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది వీరి నిర్ణయాలని వ్యతిరేకిస్తుంటే కొంత మంది సమర్ధిస్తున్నారు. ప్రస్తుతం ప్రొడ్యూసర్స్ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు షూటింగ్ లని నిరవధికంగా బంద్ చేయాలని ప్రొడ్యూసర్స్ గిల్డ్ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. తాజా నిర్ణయం వల్ల ఆగస్టు మొదటి వారం లేదా రెండవ వారంలో సెట్స్ పైకి వెళ్లనున్న స్టార్ హీరోల ప్రాజెక్ట్ లు ఎఫెక్ట్ కానున్నాయి.
ఈ నేపథ్యంలో ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది. రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఓ భారీ మూవీని చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్ లోని సరూర్ నగర్ లో జరుగుతోంది. ఈ సందర్భంగా బంద్ గురించి చరణ్ ఆరాతీశారట.
దీంతో నిర్మాత దిల్ రాజు తనకు గత కొంత కాలంగా ప్రొడ్యూసర్స్ ఎదుర్కొంటున్న సమస్యలని వివరించినట్టుగా తెలుస్తోంది. అంతే కాకుండా హీరోల వల్ల కూడా ప్రొడ్యూసర్ లు ఎలాంటి సమస్యలని ఎదుర్కొంటున్నారో కూడా వెల్లడించారట. దీంతో హీరోలందరితో తాను మాట్లాడతానని, సమస్య పరిష్కారాని తన వంతు ప్రయత్నం చేస్తానని మాటిచ్చారట. ఈ నేపథ్యంలో చరణ్ కు దిల్ రాజు కీలక అంశాలని వెల్లడించినట్టుగా చెబుతున్నారు.
స్టార్ హీరోల రెమ్యునరేషన్ లతో పాటు వారి అసిస్టెంట్ లకు అవుతున్న ఖర్చులు, టైమ్ సెన్స్, డేట్స్ అడ్జస్ట్ చేయడం తో మేనేజర్లు అవంభిస్తున్న తీరుని ప్రధానంగా చరణ్ కు దిల్ రాజు వివరించినట్టుగా తెలుస్తోంది.
దీనిపై వచ్చే వారం చరణ్ హీరోలందరితో ప్రత్యేకంగా ఓ సమావేశాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనలో వున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో సినిమా బడ్జెట్ లో కీలకంగా మారిన హీరోల రెమ్యునరేషన్ సమస్య ఓ కొలిక్కి వచ్చే అవకాశం వుందని ప్రొడ్యూసర్స్ గిల్డ్ సభ్యులు ఆశా భావం వ్యక్తం చేసినట్టుగా చెబుతున్నారు.