మెగా బాస్‌ ని ట‌చ్ చేయ‌డం క‌ష్టం

Update: 2015-11-12 05:12 GMT
స్టార్ హీరోలు సినిమా వెంట సినిమా చేయ‌డం లేద‌న్న కంప్ల‌యింట్ ఎప్ప‌టినుంచో ఉంది. ఒక్క మెగా క్యాంపునే ప‌రిశీలిస్తే బోలెడ‌న్ని సంగ‌తులు తెలుస్తాయి. ఈ క్యాంపులోనే అర‌డ‌జ‌ను మంది హీరోలున్నారు. అందులో ముగ్గురు స్టార్ హీరోలూ ఉన్నారు. ప‌వ‌న్ - చ‌ర‌ణ్‌ - బ‌న్ని ఈ ముగ్గురూ కెరీర్ ప‌రంగా చాలా నెమ్మ‌దిగా ముందుకెళుతున్నారు. క్వాంటిటీ కంటే కంటెంట్ ముఖ్య‌మ‌ని న‌మ్మి ఏడాదికో సినిమా మాత్ర‌మే చేస్తున్నారు.

ముఖ్యంగా వీళ్ల‌లో ప‌వ‌ర్‌ స్టార్ ప‌వ‌న్‌ క‌ల్యాణ్ మ‌రీ స్టో. 20ఏళ్ల కెరీర్‌ లో అత‌డు న‌టించింది కేవ‌లం  25 సినిమాలు మాత్ర‌మే. 8 సంవ‌త్స‌రాల కెరీర్‌ లో రామ్‌ చ‌ర‌ణ్ న‌టించింది కేవ‌లం 9 సినిమాలు మాత్ర‌మే. ఈ ఇద్ద‌రికంటే కాస్త బెట‌ర్‌ గా అల్లు అర్జున్ 12 ఏళ్ల కెరీర్‌ లో 16 సినిమాలు చేశాడు. ఇక ప‌వ‌న్ పేరును ఎలానూ ప్ర‌స్థావించ‌న‌క్క‌ర్లేదు. మ‌రి బ‌న్ని - చ‌ర‌ణ్ మాటేమిటి? క‌నీసం వీళ్ల‌యినా వేగంగా సినిమాలు చేస్తూ అర్థ‌సెంచ‌రీని ట‌చ్ చేస్తారంటారా? ఏమో అది ఊహ‌కైనా అంద‌నిది.

కానీ మెగా ఫ్యామిలీ నుంచే మ‌రో ఇద్ద‌రు తురుపు ముక్క‌లు హీరోలుగా వ‌చ్చారు. సాయిధ‌ర‌మ్ తేజ్‌ - వ‌రుణ్‌ తేజ్ ఒక‌రి త‌ర్వాత ఒక‌రుగా హీరోలుగా ఆరంగేట్రం చేశారు. ఈ ఇద్ద‌రూ కేవ‌లం రెండేళ్ల‌లోనే మూడేసి సినిమాల్లో న‌టించేశారు. మ‌రిన్ని ప్రాజెక్టులు పైప్‌ లైన్‌ లో ఉన్నాయి. ఈ స్పీడ్ ఇలాగే కంటిన్యూ చేస్తే ఈ కుర్రాళ్లు కొంచెం వేగంగానే ల్యాండ్‌ మార్క్ సినిమాని ట‌చ్ చేసేస్తారు. అయితే మెగా హీరోల్లో ఎవ‌రెంత స్పీడ్‌ లో వెళ్లినా .. బాస్ చిరంజీవిని ట‌చ్ చేయ‌డ‌మే క‌ష్టం. అత‌డిలా 150 సినిమాల కెరీర్ అనేది  ఓ క‌ల‌లాంటిదే.
Tags:    

Similar News