మెగాస్టార్ చిరంజీవి అంతటి వారు ఒక యువదర్శకుడి స్క్రీన్ ప్లేని మెచ్చారంటే ఎంతో విషయం ఉంటే కానీ సాధ్యం కానిది. కానీ యువదర్శకుడు సంపత్ నంది స్క్రీన్ ప్లేపై మెగాస్టార్ స్వయంగా ప్రశంసలు కురిపించారు. సంపత్ ఇంతకుముందు చరణ్ హీరోగా రచ్చ లాంటి విజయవంతమైన మాస్ ఎంటర్ టైనర్ ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రం స్క్రీన్ ప్లే మెగాస్టార్ ని మెప్పించింది.
బహుశా అందుకే ఇప్పుడు సంపత్ తెరకెక్కించిన సీటీమార్ విజయం సాధించాలని ధీవిస్తూ అతడి స్క్రీన్ ప్లేని ప్రశంసించారు.
సీతిమార్ ట్రైలర్ చూసిన తర్వాత ఆకట్టుకుందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. సీటీమార్ విజయం సాధించాలని మనస్పూర్తిగా కోరుకున్నారు. చిరంజీవి మాట్లాడుతూ ``నేను ఇప్పుడే సీటీమార్ ట్రైలర్ చూశాను. ఇది ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం గ్రామీణ క్రీడ కబడ్డీ నేపథ్యంలో బావుంది. నాకు చాలా కాలంగా సంపత్ నంది తెలుసు. అతను కథనంలో మంచి పనిమంతుడు. ఈ సినిమాలో గోపీచంద్- తమన్నా కీలక పాత్రలు పోషించారు. సినిమా కోసం కొత్త అమ్మాయిల సమూహానికి కబడ్డీలో శిక్షణ ఇచ్చారు. ముఖ్యంగా టోక్యో ఒలింపిక్స్ లో మన తెలుగమ్మాయిలు గెలిచిన సమయంలో అలాంటి కథలతో కూడిన సినిమాలు చాలా అవసరం. నేను ఇటీవల ఒలింపిక్ విజేత పివి సింధును సత్కరించాను. మహిళల విజయం పట్ల భారతదేశం గర్వపడుతుంది. మహిళలు కబడ్డీ ఆడితే ఎలా ఉంటుందనేది సీటీమార్. చివరకు వారు ఎదుర్కొంటున్న అడ్డంకులు .. అవమానాలు ఎలాంటివో సినిమాలో చూడాలి. ఇలాంటి సినిమాలు వచ్చి అందరినీ చైతన్యపరచాలి. సంపత్ కి చిత్ర బృందానికి శుభాకాంక్షలు`` అని తెలిపారు.
కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సంపత్ నంది దర్శకత్వం వహించారు. జ్వాలారెడ్డి అనే ఎనర్జిటిక్ గాళ్ పాత్రలో తమన్నా నటిస్తుండగా.. దిగంగన సూర్యవంశీ రిపోర్టర్ పాత్రను పోషిస్తుంది. మణిశర్మ సంగీతం అందించారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ సంస్థ నిర్మించింది. ఇది సెకండ్ వేవ్ ముందు రిలీజ్ కావాల్సి ఉన్నా వాయిదా పడింది. ఈనెల 10 న విడుదల కానుంది.