మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రొటీన్ భిన్నంగా సాగే కథల్ని ఎంచుకుంటూ కెరీర్ ప్రారంభం నుంచి విభిన్నమైన సినిమాల్లో నటిస్తున్నాడు. గత కొంత కాలంగా తనకు తగ్గ కథల్ని ఎంచుకుంటూ తెలుగులో మాత్రమే నటిస్తూ వస్తున్న వరుణ్ తేజ్ తాజాగా బాలీవుడ్ వైపు అడుగులు వేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా VT13 ప్రాజెక్ట్ ని మొదలు పెట్టాడు. ఈ మూవీకి కొత్త దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహించబోతున్నాడు.
'గని' ఫలితంతో తీవ్ర నిరాశకు గురైన వరుణ్ తేజ్ ఈ మూవీ తరువాత ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో ఓ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ ప్రారంభానికి ముందే వరుష్ తేజ్ తన ఎక్స్ పెరిమెంటల్ ప్రాజెక్ట్ VT13 ని సోమవారం లాంఛనంగా పట్టాలెక్కించేశాడు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్, రినైసన్స్ పిక్చర్స్ బ్యానర్ లపై ఈ మూవీని అత్యంత భారీ స్థాయిలో తెరపైకి తీసుకురాబోతున్నారు.
భారత వైమానిక దళం స్ఫూర్తితో ఓ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దనున్నారు. ఇదొక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ చేసిన ఓ సాహస గాధ నేపథ్యంలో ఈ మూవీని తెరపైకి తీసుకురానున్నారట. అయితే ఈ మూవీ స్టోరీకి గతంలో జరిగిన బాలాకోట్ దాడులకు సంబంధం వుందనే వాదన వినిపిస్తోంది.
దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ చాలా కాలం క్రితం 'ఎండ్ రన్' అనే పేరుతో ఓ వెమె వీడియోని రూపొందించాడు. 2019లో బాలకోట్ ఎయిర్ స్ట్రైక్ లో పాల్గొన్న పైలట్ల డాక్యుమెంటరీగా తీన్ని రూపొందించాడు.
ఆ వీడియో ద్వారానే సోనీ పిక్చర్స్ వారిని దర్శకుడు సంప్రదించాడట. 2019లో పాక్ ఆక్రమిత కశ్మీర్ లోకి ఎర్ ఫోర్స్ కెప్టెన్ అభినందన్ వర్థమాన్ వెళ్లిదాడి చేయడం, ప్రమాద వశాత్తు తను ప్రయాణిస్తున్న ఫ్లైట్ కూలిపోవడంతో అతను పాకిస్థాన్ సైన్యానికి బందీగా దొరికాడు. మూడు రోజుల పాటు చిత్ర హింసలకు గురిచేసిన పాక్ అంతర్జాతీయ సమాజం ముందు దోషిగా నిలబడే ప్రమాదం వుందని అభినందన్ వర్థమాన్ ని ఎట్టకేలకు విడిచిపెట్టింది.
ఇదే కథతో ముందు VT13 ప్రాజెక్ట్ ని చేయాలని ప్లాన్ చేసుకున్న శక్తి ప్రతాప్ సింగ్ ఆ తరువాత అందులో వివాదాస్పద పాయింట్ ని లేపేసినట్టుగా తెలుస్తోంది. బాలకోట్ ఎయిర్ స్ట్రైక్ లోనూ భారీ మార్పులు చేశారట. దీంతో అభినందన్ వర్థమాన్ కు సంబంధించిన కీలక ఎపిసోడ్ ని ఈ మూవీ స్టోరీ నుంచి లేపేశారని తెలుస్తోంది. అది వుంటే కాంట్రవర్సీ అవుతుందనే అనుమానంతో సోనీ పిక్చర్స్ వారు భారీ మార్పులు చేసినట్టుగా తెలుస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.