మెగా ప్రిన్సెస్ ప‌చ్చ‌బొట్టు వెన‌క సీక్రెట్

Update: 2022-11-10 08:30 GMT
టాటూల‌పై మ‌న‌సు పారేసుకునే క‌థానాయిక‌ల్లో చెన్నై చంద్రం త్రిష కృష్ణ‌న్ పేరు తొలిగా వినిపిస్తుంది. ఆ త‌ర‌వాత నయనతార - తాప్సీ- సమంత- త‌మ‌న్నా-  మాళ‌విక‌ లాంటి క‌థానాయిక‌ల‌కు అరుదైన ప‌చ్చ‌బొట్ల‌తో క‌నిపించారు. శ్రుతిహాస‌న్ ఇత‌ర నాయిక‌ల‌తో పోలిస్తే విలక్ష‌ణ‌మైన టాటూల‌తో సర్ ప్రైజ్ చేస్తుంటారు.

తాజాగా మెగా ప్రిన్సెస్ నిహారిక అలాంటి ఒక టాటూ వ‌ల్ల చ‌ర్చ‌ల్లోకొచ్చారు. ఈ టాటూ చాలా ప్ర‌త్యేక‌త‌ను క‌లిగి ఉంది. నిహారిక ఇటీవ‌లి వెకేష‌న్ నుండి కొన్ని త్రోబ్యాక్ ఫోటోల‌ను షేర్ చేయ‌గా అందులో త‌న వీపు భాగంలో ఉన్న ప‌చ్చ‌బొట్టు ఎంతగానో ఆక‌ర్షించింది. నిహారిక ప్ర‌స్తుతం టర్కీ వెకేష‌న్ లో ఉన్నారు. త‌న గాళ్స్ గ్యాంగ్ తో అక్క‌డ న‌దీ జ‌లాలు కొండ‌లు కోన‌ల్లో జ‌ల‌పాతాల్లో అంద‌చందాల‌ను త‌నివి తీరా ఆస్వాధిస్తున్నారు. సాయం సంధ్య వేళ లేలేత సూర్య కిర‌ణాలు తాకే వేళ వేగంగా పారే నీటిలో క‌యాకింగ్ ని కూడా ఆస్వాధించారు. జ‌ల‌పాతాల్లో ఈత‌కు ప్రాధాన్య‌త‌నిచ్చి ఎంజాయ్ చేయ‌డం క‌నిపిస్తోంది.

ఆ ఫోటోల బంచ్ ని స్వ‌యంగా నిహారిక‌ ఇన్ స్టాలో షేర్ చేయ‌గా అవి వైర‌ల్ గా మారాయి. ఈ ఫోటోల్లోనే బికినీ లుక్ లో చాలా యూనిక్ గా క‌నిపించారు. త‌న కుడి భుజం దిగువ‌గా టాటూ కనిపిస్తుంది. రెక్క‌లు చాచి ఎగురుతున్న పక్షి .. అది అంద‌మైన ప‌చ్చ బొట్టు. దాని కింద NK అనే రెండు అక్షరాలు ఉన్నాయి. ట‌ర్కీలో ఈ టాటూను వేయించుకుందా? అన్న‌ది మాత్రం సీక్రెట్. కొంద‌రైతే ఇది త్రోబ్యాక్ టాటూ. ఐదేళ్ల‌ క్రితం ఆ టాటూను వేయించుకుంద‌ని కూడా గుస‌గుస‌లాడుతున్నారు.

నిహారిక ఇలా ఎప్పుడూ బికినీలో టాటూతో క‌నిపించింది లేదు. అందుకే ఇప్పుడు అంతా క‌న్ఫ్యూజ‌న్ లో ఉన్నారు. ఏది ఏమైనా నిహారిక టాటూ వెన‌క అస‌లు ర‌హ‌స్యం ఏమిట‌న్న‌ది కొంద‌రు అభిమానులు క‌నిపెట్టేశారు. అది లేటెస్ట్ కాదు త్రోబ్యాక్ టాటూ అని డిక్లేర్ చేస్తున్నారు. టాలీవుడ్ లో హోస్ట్ గా న‌టిగా నిర్మాత‌గా వెబ్ సిరీస్ ల సృష్టిక‌ర్త‌గా నిహారిక ఆల్ రౌండ‌ర్ నైపుణ్యం ప్ర‌ద‌ర్శించారు. టెకీ చైత‌న్య‌ను పెళ్లాడాక న‌ట‌న‌కు దూరంగా ఉన్నారు. మునుముందు సినీనిర్మాణంపై దృష్టి సారించే వీలుంద‌ని కూడా టాక్ వినిపించింది. ప్ర‌తిభావ‌ని అయిన‌ నిహారిక తిరిగి క‌థానాయిక‌గా రీఎంట్రీ ఇచ్చేది ఎప్పుడు? అన్న‌దానిపై స్ప‌ష్ఠ‌త రావాల్సి ఉంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News