మెగా రిపబ్లిక్‌ ఇంట్రెస్టింగ్‌ కాన్సెప్ట్‌

Update: 2021-02-05 02:30 GMT
సాయి ధరమ్‌ తేజ్ హీరోగా దేవ కట్టా దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకు రిపబ్లిక్ అనే టైటిల్‌ ను ఖరారు చేసినట్లుగా ఇటీవలే అధికారికంగా ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాను జూన్‌ 4వ తారీకున విడుదల చేసేలా దర్శకుడు దేవా కట్టా ప్లాన్‌ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో సాయి ధరమ్‌ తేజ్‌ కలెక్టర్‌ పాత్రలో కనిపించబోతున్నట్లుగా కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చాయి. ఇప్పుడు మరో ప్రచారం ఇండస్ట్రీ వర్గాల్లో షికారు చేస్తోంది.

ఈ సినిమా ఏలూరు సమీపంలో ఉండే కొల్లేరు సరస్సు కు సంబంధించిన కాన్సెప్ట్‌ తో సాగుతుందని అంటున్నారు. కలెక్టర్‌ అయిన సాయి ధరమ్‌ తేజ్‌ లోకల్‌ పొలిటీషియన్స్ తో కొల్లేరు సరస్సు కోసం దాని పునర్‌ వైభవం కోసం ఫైట్ చేస్తాడట. వారితో హీరో చేసే ఫైట్‌ ఈ సినిమా కాన్సెప్ట్ గా తెలుస్తోంది. ఇందులోనే ఒక ప్రేమ కథను కూడా మేళ్లవించి దర్శకుడు దేవా కట్టా చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ఈ సినిమా మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్ కెరీర్‌ లో ప్రత్యేకంగా ఉంటుందని యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. సోలో బ్రతుకే సో బెటర్‌ వంటి కమర్షియల్‌ సినిమా చేసిన తేజ్ కు ఇది పూర్తి వైవిధ్యభరితమైన ఇమేజ్‌ ను కట్టబెడుతుందని అంటున్నారు.


Tags:    

Similar News