చిరంజీవి రెండో కూతురు శ్రీజ వివాహం గురించి యేడాది కాలంగా ప్రచారం జరుగుతోంది. పెళ్లి జరిగిపోయిందని కొందరు, ఇంకా లేదని మరొకొందరు మాట్లాడుకొన్నారు. అయితే శ్రీజ పెళ్లికి సంబంధించిన పక్కా సమాచారం తాజాగా బయటికొచ్చింది. మార్చిలో ఆ పెళ్లి జరుగుతుందట. అబ్బాయి గురించి రకరకాలుగా ప్రచారం జరిగినా శ్రీజ తన క్లాస్ మేట్ అయిన కళ్యాణ్ నే పెళ్లి చేసుకోబోతోంది. కళ్యాణ్ చిత్తూరు జిల్లాకి చెందిన వ్యాపారవేత్త కిషన్ కొడుకు.
తన గురించి అన్నీ తెలిసిన వ్యక్తి కావడం, తన క్లాస్ మేట్ కావడంతో కళ్యాణ్ ని వివాహం చేసుకోవాలని శ్రీజ ఫిక్సయ్యింది. తనకి ఎంతో ఇష్టమైన చిన్న కూతురు పెళ్లిని ఘనంగా జరిపేందుకు చిరు ఏర్పాట్లు చేస్తున్నాడు. ఇటీవలే ఓ హోటల్ లో నిశ్చితార్థం జరిగింది. ఇక పెళ్లి తంతు జరగడమే ఆలస్యం. ఆ విషయాన్ని చిరంజీవి స్వయంగా ప్రకటిస్తారట. కొడుకు పెళ్లిలాగే అందరినీ ఆహ్వానించి శ్రీజ వివాహం జరపాలని చిరు భావిస్తున్నట్టు తెలుస్తోంది. మార్చిలో చిరంజీవి చాలా బిజీగా గడపబోతున్నాడు. ఆ నెలలోనే శ్రీజ వివాహంతోపాటు తన కొత్త చిత్రం కూడా మొదలవబోతోంది.