చిరు ఇంటి పెళ్ళి బాజాలంటున్న పత్రిక

Update: 2016-02-04 08:49 GMT
ప్రముఖ వార్తా పత్రిక డెక్కన్‌ క్రానికల్‌ ఒక బాంబు పేల్చింది. మెగాస్టార్‌ చిరంజీవి ఇంట పెళ్ళి బాజాలు మోగనున్నాయ్‌ అంటూ బాంబు పేల్చింది. ఇప్పటికే మెగాస్టార్‌ ఫ్యామిలీలో అందరికీ పెళ్ళిళ్లు అయిపోయాయ్‌ గా.. మరి ఎవరి ఈ బాజాలు??

అదేనండీ.. ఆల్రెడీ పెళ్ళిచేసుకొని.. కొన్ని మనస్పర్ధల కారణంగా శిరీష్‌ భరద్వాజ్‌ దగ్గర నుండి డైవోర్స్‌ తీసుకున్న శ్రీజకు ఇప్పుడు కొత్త సంబంధం కుదిరిందట. మొన్న పవన్‌ కళ్యాన్‌ సడన్‌ గా కేరళ నుండి కాపుల యాగిటేషన్‌ తో మనస్సు చలించి పోవడంతో హైదరాబాద్‌ వచ్చి ఒక మీటింగ్‌ షురూ చేశాడు పవన్‌. అయితే అసలు విషయం మాత్రం చిత్తూరుకు చెందిన ఒక అబ్బాయితో చిరంజీవి చిన్న కూతురు శ్రీజ వివాహం నిశ్చితార్ధం జరిగిందని.. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పవన్‌ వచ్చారంటూ డెక్కన్‌ క్రానికల్‌ పేర్కొంది. అయితే పెళ్లెప్పుడు, అసలు వరుడు ఎవరు అనే డిటైల్‌ మాత్రం తెలియలేదట.

గత కొంత కాలంగా శ్రీజ పెళ్ళి గూర్చిన రూమర్లు వినిపిస్తున్నప్పటికీ.. ఇలా ఒక లీడింగ్‌ న్యూస్‌ పేపర్‌ ప్రముఖంగా వార్తలు రాయడం ఇదే మొదటసారి.
Tags:    

Similar News