తెలుగు రాష్ట్రాల్లో మెగాస్టార్ చిరంజీవి.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరిట వెలిసిన అభిమాన సంఘాల గురించి చెప్పాల్సిన పనిలేదు. తమ హీరోల పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్ర చిరంజీవి యువత...అఖిల భారత చిరంజీవి యువత ఆధ్వర్యంలో ఘనంగా సేవా కార్యక్రమాల నిర్వహిస్తుంటారు. రక్తదాన శిబిరాలు...ఉచితంగా కళ్లద్దాలు పంచడం... అన్నదాన కార్యక్రమాలు వంటివి చేస్తుంటారు. ఇలాంటి వేడుకలకు వచ్చినప్పుడు మెగా అభిమానులు అంతరాలను మర్చిపోయి కలిసి పనిచేస్తుంటారు.
అయితే తాజాగా మెగా అభిమానుల్లోనే ఓ పురుగు ఉందన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ విషయం గ్రహించిన రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. శ్యామ్ ప్రసాద్ అతనిపై వేటు వేస్తున్నట్లు ప్రకటించారు. ఇంతకీ ఎవరా వ్యక్తి? అతను చేసిన వ్యతిరేక కార్యకలాపాలు ఏంటి? అంటే అసలు వివరాల్లోకి వెళ్లాల్సిందే. అతని పేరు బ్రండ్రెడ్డి చందు. గుంటూరుకు చెందిన వ్యక్తి. కొన్నేళ్లగా చందు చిరంజీవి..పవన్ కళ్యాణ్ లకు డైహార్డ్ ఫ్యాన్ గా కొనసాగుతున్నాడు. అయితే కొన్ని రోజులుగా మెగా అభిమానుల మనోభావాలు దెబ్బ తినేలా అతను సోషల్ మీడియాలో కామెంట్లు..వీడియో లైవ్ లు పెడుతున్నాడుట.
మెగా సంఘం నిబంధలను అతిక్రమించి మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్నాడుట. ఇలా చేయకూడదని ఎంత చెప్పినా వినలేదుట. దీంతో లాభం లేదనుకున్న రాష్ట్ర చిరంజీవి యువత అధ్యక్షుడు ఎల్ శ్యామ్ ప్రసాద్.. మిగతా సభ్యులు అతన్ని బహిష్కరిస్తున్నట్లు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించారు. ఇకపై చిరంజీవి యువతగా..మెగా కుటుంబంతో ఆయనకి ఎటువంటి సంబంధం లేదని పత్రికాముఖంగా తెలియజేసారు. అయితే ఈ ఘటనకు సంబంధించి అఖిల్ భారత చిరంజీవి యువత అధ్యక్షుడు రమణం స్వామినాయుడు దూరంగా ఉండటం పలు అనుమానాలకు దారి తీస్తోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.