మెగాస్టార్ బెడ్ రెస్ట్ తీసుకుంటున్నారా? అంటే అవుననే తాజాగా ఆయన సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన ఫోటో చెబుతోంది. ఆయన దుప్పటి కప్పుకుని బెడ్ పై శయనించారు. పైగా కాళ్లకు సాక్స్ ధరించి కనిపిస్తున్నారు. అలా రిలాక్స్ అవుతున్నప్పుడు టీవీలో ఫుట్ బాల్ ఆటను వీక్షిస్తున్నారు. అయితే ఈ ఫోటో చూసిన అభిమానులు చాలానే కంగారు పడుతున్నారు. తమ అభిమాన మెగాస్టార్ అమితాబ్ జీ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.
అయితే అమితాబ్ జీకి ఏమైంది? అంటే.. ఆయన గత కొన్నేళ్లుగా అలుపన్నదే ఎరుగకుండా వరుసగా సినిమాలు బుల్లితెర షోలు చేస్తూ ఉన్నారు. సినిమాల కోసం ఔట్ డోర్ షూటింగులకు వెళుతున్నారు. ఓవైపు వయసు 70 దాటింది... పైగా అవిశ్రాంతంగా ప్రయాణాలతో ఆయన ఆరోగ్యంపై కోలుకోలేని దెబ్బ పడుతోంది. పైగా ఆయన సుదీర్ఘ కాలం టీబీ.. లివర్ సిర్రోసిస్ వంటి వ్యాధులకు గురయ్యారు. దీంతో ఆరోగ్యం ప్రస్తుతం సహకరించడం లేదట. అలాంటి పరిస్థితిలో ఉండీ ఇటీవల టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి ఇచ్చిన మాట ప్రకారం హైదరాబాద్ కి వచ్చి సైరా -నరసింహారెడ్డి చిత్రీకరణలో పాల్గొన్నారు.
తాజాగా అమితాబ్ జీ షేర్ చేసిన ఫోటో చూడగానే ఫ్యాన్స్ ఉద్వేగానికి లోనవుతున్నారు. మీ ఆరోగ్యానికి ఏమీ కాలేదని భావిస్తున్నాం. సాధ్యమైనంత తొందరగా మీరు కోలుకోవాలని.. అలాగే ఈ విరామ సమయంలో టీవీలో వినోద కార్యక్రమాలతో కాలక్షేపం చేయడం సరైనదేనని .. మీరు మాకు ఎంతో విలువైన అమూల్యమైన స్టార్.. మీకోసం దేవుడిని ప్రార్థిస్తామని ఫ్యాన్స్ తమ అభిమానం చాటుకున్నారు. కేవలం తన ఆరోగ్యం సహకరించకపోవడం వల్లనే కోల్ కత ఇంటర్నేషనల్ ఫిలింపెస్టివల్స్ కి అటెండ్ కాలేకపోయానని అమితాబ్ జీ వెల్లడించారు ఇంతకుముందు. వరుసగా ఏడేళ్ల పాటు ఈ ఉత్సవాలకు వెళ్లిన అమితాబ్ ఈసారి మిస్సవుతుండడంపై ఆవేదన వ్యక్తం చేస్తూ బ్లాగులో పోస్టుల్ని పెట్టారు. వీటికి అభిమానులు ఎంతో కలత చెందుతున్నారు. 70 ప్లస్ ఏజ్ లోనూ బిగ్ బీ సాహసాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన బాగా అలసిపోయారు. అనారోగ్యాల్ని ఎదుర్కొని సమస్యలతో పోరాడి గెలిచిన వీరుడిగా ఆయనను అభిమానులు చూస్తున్నారు. ఇప్పటికీ ఆయన అందరిలో స్ఫూర్తిని నింపుతూనే ఉన్నారు. హ్యాట్సాఫ్ టు బిగ్ బీ. ది గ్రేట్ ఇండియన్ మెగాస్టార్.