చ‌ర‌ణ్ హాలీవుడ్ కి ఫిక్సైతే? ఈ కండీష‌న్లు త‌ప్ప‌నిస‌రి!

Update: 2022-07-17 10:30 GMT
మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ రేంజ్ అంత‌కంత‌కు పెరిగిపోతుంది. ఒక్క సినిమాతోనే పాన్ ఇండియాని దాటి..పాన్ వ‌ర‌ల్డ్ కి రీచ్ అయిపోతున్నాడు. కోస్టార్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ `ఆర్ ఆర్ ఆర్` లో ధీటైన పాత్ర పోషించినా చ‌ర‌ణ్ లో ఏదో యూనిక్ క్వాలిటీ హాలీవుడ్ క‌ళ్ల‌లో ప‌డింది. అందుకే ఇప్పుడు హాలీవుడ మేక‌ర్లే చ‌ర‌ణ్ తో సినిమా చేయ‌డానికి రెడీ అవుతున్నారు.

చ‌ర‌ణ్ కి ఆ ర‌కంగా హాలీవుడ్ ఆఫ‌ర్ క‌ళ్ల ముందుంది. మ‌రి ఈ ఛాన్స్ చ‌ర‌ణ్ స‌ద్వినియోగం చేసుకుంటాడా? లేదా? అత‌ని ఇష్టం మీద‌నే ఆధార‌ప‌డి ఉంటుంది. అయితే చ‌ర‌ణ్ హాలీవుడ్ కి రావాలంటే మాత్రం  కొన్ని కండీష‌న్లు మాత్రం త‌ప్ప‌క పాటించాల్సి ఉంటుంద‌ని స్టార్ రైట‌ర్ కమ్ డైరెక్ట‌ర్  ఆర్ .ఆర్ స్టీవార్డ్  వెల్ల‌డించారు.

`చ‌ర‌ణ్ కోసం మంచి క‌థ రాస్తా. అందులో అత‌నే లీడ్ రోల్ పోషిస్తారు. అందుకోసం ఎంతైనా శ్ర‌మించాడానికి సిద్దంగా ఉన్నా. కానీ చ‌ర‌ణ్ పూర్తిగా కొన్నాళ్ల పాటు అమెరికాలో ఉండాలి. నా టీమ్ తో పాటు ప్ర‌యాణం చేయాలి. అప్పుడే చ‌ర‌ణ్ కి ఎలాంటి క‌థ రాయాలి? అత‌న్ని తెర‌పై ఎలా ప్ర‌జెంట్ చేయాల‌న్న దానిపై పూర్తి క్లారిటీ త‌మ‌కుంటుంద‌న్న విధానాన్ని` స్టీవార్డ్ వ్య‌క్తం చేసారు.

స్టీవార్డ్  `మాండీ`..`కేబినేట్ ఆఫ్ క్యూరో సైట్స్`.. `ది వాచ‌ర్:  బ్ల‌డ్ ఆరిజ‌న్` లాంటి చిత్రాలు తెర‌కెక్కించారు. ఇంకా ఎన్నో హాలీవుడ్  సంచ‌ల‌న చిత్రాల‌కు క‌థ‌..క‌థ‌నాలు అందించారు. హలీవుడ్ స్టార్ హీరోల్లో ఒక‌రైన నికొలాస్ కేస్ లాంటి హీరోల‌కు విజ‌యాలు అందించిన ద‌ర్శ‌క‌-ర‌చ‌యిత‌గా స్టీవార్డ్ కి మంచి పేరుంది.  

అంత‌టి దిగ్గ‌జంతో ప‌నిచేసే అరుదైన అవ‌కాశం ఇప్పుడు చ‌ర‌ణ్ కి ద‌క్కింది. మ‌రి ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేస‌కుంటారా?  లేదా? అన్న‌ది అత‌ని  నిర్ణ‌యాల‌పై  ఉంటుంది. అవ‌కాశం వ‌స్తే హాలీవుడ్ కి ఎగిరిపోవాల‌ని బాలీవుడ్ స్టార్ హీరోలు సైతం వెయిట్ చేస్తున్నారు.  ఇప్ప‌టికే కొంత మంది స్టార్లు కొన్ని సినిమాలు చేసిన‌ప్ప‌టికీ అక్క‌డ పెద్ద‌గా స‌క్సెస్ అవ్వ‌లేదు.

ఇప్పుడా స‌క్సెస్ చ‌ర‌ణ్ కోసం ఎదురు చూస్తుంది. హాలీవుడ్ కి వెళ్లి స‌క్సెస్ అందుకుంటే గ‌నుక ఇండియాన్ స్టార్స్ లో చ‌ర‌ణ్ కి ప్ర‌త్యేక‌ స్థానం ఉంటుంది. మ‌రి ఇప్ప‌టివ‌ర‌కూ చ‌ర‌ణ్ ఈ విష‌యంపై ఎక్క‌డా స్పందించ‌లేదు. ప్ర‌స్తుతం చ‌ర‌ణ్ -శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. 
Tags:    

Similar News