పబ్లిక్ వేదికలపై మాట్లాడేప్పుడు చాలా అవగాహనతో ఎలాంటి తప్పిదాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలకు ఉంది. ఆ మాటకొస్తే ఈరోజుల్లో ఎవరు ఎలాంటి తప్పుడు వ్యాఖ్యానం చేసినా అది మనోభావాలు దెబ్బ తినేందుకు కారణమవుతోంది. ప్రతి చిన్న విషయాన్ని సోషల్ మీడియాలకు ఎకెక్కిస్తున్నారు నెటిజనం. అక్కడ డిబేట్ల పేరుతో బోలెడంత రచ్చ సాగుతోంది. స్టార్ హీరో స్టార్ హీరోయిన్ లేదా ఇంకెవరైనా ఈ వేదికలపై విడిచిపెట్టడం లేదు.
ఇప్పుడు అలాంటి సెగను ఎదుర్కొంటున్నారు మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి. అతడు పబ్లిక్ వేదికపై చేసిన ఓ తప్పుడు వ్యాఖ్య పదే పదే విమర్శలకు కారణమైంది. సీనియర్ హీరో దురుసు వ్యాఖ్యను సోషల్ మీడియా వేదికగా వైరల్ చేస్తూ అభిమానులు తప్పును ఎత్తి చూపారు. దీంతో మమ్ముట్టి దిగి వచ్చి పబ్లిక్ వేదికపైనే స్వయంగా క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. అయితే మమ్ముట్టి చేసిన ఆ వ్యాఖ్య ఏమిటీ... ఎవరిని ఉద్ధేశించి ఆ కామెంట్ చేశారు? అనేది తెలియాలంటే పూర్తి కథను తెలుసుకోవాలి.
మమ్ముట్టి '2018' మలయాళ మూవీకి సంబంధించిన అధికారిక టీజర్ ను ఇటీవల విడుదల చేశారు. ఇది 2018లో సంభవించిన కేరళ వరదల ఆధారంగా తెరకెక్కించిన సినిమా. నాటి వరదల్లో ప్రజల కష్టనష్టాలు మనుగడకు సంబంధించిన ఉత్కంఠభరితమైన డ్రామా కథాంశంతో తెరకెక్కింది. ఈ చిత్రాన్ని 'ఓం శాంతి ఓషానా'తో విమర్శకుల ప్రశంసలు పొందిన ప్రతిభావంతుడైన డెబ్యూ దర్శకుడు జూడ్ ఆంథనీ జోసెఫ్ తెరకెక్కించారు. టీజర్ లాంచ్ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రచార వేదికపై దర్శకుడు జూడ్ ఆంథనీ హెయిర్ స్టైల్ పై మెగాస్టార్ చేసిన వ్యాఖ్యలు (మమ్ముట్టి ప్రసంగం) సోషల్ మీడియాలో చాలా ప్రకంపనలు సృష్టించింది. మలయాళ పరిశ్రమ అగ్ర కథానాయకుడు మమ్ముట్టి నేరుగా తన దర్శకుడిని బాడీ షేమ్ చేశాడని భావించిన నెటిజన్లు అతనిపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీనికి వెంటనే స్పందిస్తూ మమ్ముట్టి హృదయపూర్వకంగా క్షమాపణలు చెప్పాడు.
ఇంతకీ స్టార్ హీరో మమ్ముట్టి చేసిన కామెంట్ ఏమిటీ? అంటే... అతడు మలయాళంలో ఒక కామెంట్ చేసారు. జూడ్ ఆంథనీ తన తలపై వెంట్రుకలు లేకపోయినా.. అసాధారణమైన మెదడు కలిగిన అత్యంత ప్రతిభావంతుడైన ఫిలింమేకర్ అని వ్యాఖ్యానించాడు. ఈ ప్రకటన నెటిజన్ లకు అస్సలు నచ్చలేదు. మెగాస్టార్ నేరుగా బట్టతల ఉన్నవారిని అవమానించాడని భావించారు. అయితే మమ్ముట్టి దీనిని గ్రహించి తర్వాత తన అధికారిక సోషల్ మీడియా లో అలాంటి ప్రకటన చేసినందుకు విచారం వ్యక్తం చేశారు. తప్పును ఎత్తి చూపినందుకు తన అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.
సామాజిక మాధ్యమాల్లో మమ్ముట్టి వివరణ ఇలా ఉంది. "డియర్ ఆల్.. నిన్న జరిగిన '2018' సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో దర్శకుడు జూడ్ ఆంటోనిని పొగిడేందుకు ఉపయోగించిన ఉద్వేగభరితమైన పదాలు మిమ్మల్ని బాధపెట్టినందుకు నన్ను క్షమించండి. అలాంటి పద్ధతులు పునరావృతం కాకుండా మరింత జాగ్రత్త తీసుకుంటాను. దీనిని నా దృష్టికి తీసుకొచ్చిన వారందరికీ ధన్యవాదాలు" అని మమ్ముట్టి పోస్ట్ చేశారు. చేసిన తప్పును వెంటనే అంగీకరించి సోషల్ మీడియా పోస్ట్ తో క్షమాపణలు చెప్పినందుకు నెటిజన్లు ఇప్పుడు మమ్ముట్టిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
మమ్ముట్టి పోస్ట్ పై జూడ్ ఆంథనీ జోసెఫ్ కూడా స్పందించారు. అయితే దర్శకుడు జూడ్ .. మమ్ముట్టి మాటలను సమర్థిస్తూ.. మెగాస్టార్ కి తనపై ఉన్న ప్రేమ గురించి బాగా తెలుసునని ..తన ప్రతిభను మెచ్చుకోవడానికి ఆయన ఉపయోగించిన పదాలను తప్పుగా భావించవద్దని నెటిజనులను అభ్యర్థించాడు. జూడ్ ఆంథనీ జోసెఫ్ తన జుట్టు రాలడానికి బెంగళూరు కార్పొరేషన్ నీటి సరఫరా.. వివిధ షాంపూ బ్రాండ్ లను ఉత్పత్తి చేసే సంబంధిత వ్యక్తులందరినీ విమర్శించాలని కూడా సరదాగా వ్యాఖ్యానించారు. తరువాత 2018 దర్శకుడు జూడ్ మమ్ముట్టి క్షమాపణ పోస్ట్ ను తాను పట్టించుకోనని తెలిపాడు. నా హెయిర్ స్టైల్ నా ఫేవరెట్ స్టార్ ని ఇబ్బందుల్లోకి నెట్టిందని జూడ్ విచారం వ్యక్తం చేశాడు. మొత్తానికి పొరపాటున తప్పు మాట అన్నందుకు దానికి మెగాస్టార్ మమ్ముట్టి వెంటనే క్షమాపణలు చెప్పి తన హుందాతనాన్ని చాటుకున్నారు. దీంతో కథ సుఖాంతమైంది. ఇప్పుడు అభిమానులు మమ్ముట్టిని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.