భారీ అంచనాలు పెట్టుకున్న సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోతే చాలా డిజప్నాయింట్ అవుతాం. మెగాస్టార్ చిరంజీవి కూడా 'ఆచార్య' ఫలితంతో తీవ్ర నిరుత్సాహానికి లోనయ్యారు. స్టార్ డైరెక్టర్ కోరటాల శివ తెరకెక్కించిన ఈ మూవీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించినా పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. ప్రధానంగా చరణ్ పాత్రని పెంచడం వల్లే సినిమా ఫలితం తారుమారైందనే వాదనలు ఇప్పటికీ వినిపిస్తున్నాయి.
భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా భారీ డిజాస్టర్ అనిపించుకుని మెగాస్టార్ కు, కొరటాలకు భారీ షాకిచ్చింది. సినిమా విడుదలై ఇన్ని నెలలు అవుతున్నా ఆ భయాలు ఇప్పటికీ మెగాస్టార్ ని వెంటాడుతూనే వున్నాయి.
ఈ మూవీ తరువాత చిరంజీవి మలయాళ సూపర్ హిట్ ఫిల్మ్ 'లూసీఫర్' ఆధారంగా తెరకెక్కిన 'గాడ్ ఫాదర్'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మోహన్ రాజా డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఇప్పటి వరకు చిరు ఆశించిన స్థాయిలో బజ్ ని క్రియేట్ చేయలేకపోయింది.
ఫస్ట్ లుక్, టీజర్ రిలీజ్ చేసినా 'గాడ్ ఫాదర్' కు రావాల్సిన బజ్ క్రియేట్ కాలేదు. కారణం చిరు సినిమా అనే ఇంపాక్ట్ ని టీజర్ కలిగించకపోవడమే. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన సినిమా అయినా ఈ మూవీపై ఇప్పటి వరకు ఏమాత్రం బజ్ ని చిత్ర బృందం కలిగించలేకపోయింది. 'ఆచార్య' డిజాస్టర్ కారణంగా ప్రేక్షకుల్లో ఈ మూవీపై పెద్దగా ఆసక్తిని క్రియేట్ చేయడంలో మేకర్స్ విఫలం అయ్యారనే కామెంట్ లు వినిపిస్తున్నాయి.
ఇవి చిరు దాకా వెళ్లడంతో ఆయన కూడా కొంత అసంతృప్తితో వున్నారట. సినిమా రిలీజ్ కి నెలరోజులు కూడా లేకపోవడంతో ఎలాగైనా కొత్త కంటెంట్ తో సినిమాకు బజ్ ని క్రియేట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇందు కోసం ప్రత్యేకంగా ఓ టీమ్ ని రంగంలోకి దింపాలనుకుంటున్నారట. అంతే కాకుండా సినిమా గురించి ప్రత ఒక్కరూ ప్రత్యేకంగా చెప్పుకునేలా పలు కార్యక్రమాలని, ప్రత్యేక ఇంటర్వ్యూలని ప్లాన్ చేయిస్తున్నారట.
ఇదంతా గమనించిన వారు మాత్రం చిరుని 'ఆచార్య' భయం ఇంకా వెంటాడుతోందని ఇండస్ట్రీ వర్గాలు కామెంట్ చేస్తున్నాయని తెలిసింది. 'గాడ్ ఫాదర్'లో నయనతారతో పాటు హీరో సత్యదేవ్, సముద్రఖని, సునీల్, మురళీశర్మ, గంగవ్వ, బ్రహ్మాజీ, బిగ్ బాస్ దివి అతిథి పాత్రలో దర్శకుడు పూరి జగన్నాథ్ తదితరులు నటిస్తున్నారు. ఈ మూవీకి సంగీతం తమన్, ఫొటోగ్రఫీ నీరవ్ షా.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.