పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జనసేనానిగా ప్రజా సేవలో ఉన్న సంగతి తెలిసిందే. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే రాజకీయాల్లో బిజీ అయ్యారు. ఇక జనసేనాని కి ఉన్న ఫాలోయింగ్ పైనా నిరంతరం ప్రజల్లో చర్చ సాగుతోంది. అయితే పవన్ వెంట అంతగా జనసైన్యం పెరగడానికి కారణమేమిటీ? అన్నదానిపై మెగాస్టార్ చిరంజీవి అభిప్రాయం ఏమై ఉంటుంది? అంటే.. దీనికి ఆన్సర్ ఆయన నుంచే రాబట్టాడు హరీష్ శంకర్.
చిరు నోట పలికిన ఆ మాట ఇలా ఉంది. ''లక్షలాది మంది నడిచొస్తారు.. తను రోడ్డెక్కితే.. కాదు..! ఆ లక్షలాది మందికి వీడు గుర్తున్నాడన్నదే వాళ్ల ధైర్యం.. బాగా రాసారు'' అంటూ చిరు అభిమాని మాటనే తనదైన శైలిలో జవాబిచ్చారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రోడ్ షోలకు .. సమావేశాలకు ఊక వేస్తే రాలనంత మంది ప్రజలు విచ్చేస్తున్నారు. ఓటుకు నోటు రాజకీయాల్లో ఆయన వెనకబడినా కానీ తనకంటూ కొంత ఓటు బ్యాంకు పెరుగుతోందని కూడా ఇటీవల నిరూపణ అవుతోంది.
ఖైదీ నంబర్ 150తో రీఎంట్రీ ఇచ్చాక వింత పరిస్థితి. 14 ఏళ్ల రాజకీయాల్లో నవ్వడం మర్చిపోయాను. ఎవరైనా జోక్ చేసినా నవ్వు రావడం లేదు. నాయనా నీలో హాస్య గ్రంధులు లేవా..? అనుకున్నాను.. అని చిరు అన్నారు. దొంగ మొగుడు - రౌడీ అల్లుడు లాంటి క్యారెక్టర్లు వస్తే మళ్లీ నేనేంటో చూపిస్తాను.. అని అన్నారు.
హరీష్ నుంచి వచ్చిన ప్రశ్నల్లో మల్టీస్టారర్ పైనా ప్రశ్న ఆకట్టుకుంది.
మల్టీస్టారర్లలో ఇద్దరిని చూసాం.. ముగ్గురిని చూసేదెప్పుడు? చిరంజీవి-చరణ్ -చరణ్- పవన్ కనిపిస్తారా? అని అడిగాడు. దానికి చిరు సమాధానం ఆసక్తికరం. ''ఇద్దరి కాంబినేషన్ లో ఐఫీస్ట్ అవుతుంది.. మీరు అన్న కాంబినేషన్ కి ఇది మ్యాచ్ అవుతుంది'' అని అన్నారు.
భవదీయుడు చిత్రంలో మీ ఇద్దరూ(చిరు-చరణ్) క్యామియోలో కనిపిస్తారా అవకాశం ఉంటే? అని హరీష్ అడిగాడు. ''తమాషాగా కనిపిస్తే ఛమక్కులా ఓకే. భవదీయుడులో కనిపించేందుకు మేం రెడీ..'' అని చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.
ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్ లో అంటే చంటబ్బాయ్ సినిమా ఈ జనరేషన్ తో తీస్తే ఎవరిని అలా చూడాలనుకుంటున్నారు? అని చిరును ప్రశ్నించగా.. తీస్తే బన్నీ చేయగలడు.. వాడు జిమ్మిక్ యాక్చువల్ గా పాత్రను కొత్తగా చేయగలడు.. క్యారికేచర్లు చేస్తాడు బన్నీ.. అని చిరంజీవి అన్నారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య చిత్రం ఈ శుక్రవారం విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రమోషనల్ కార్యక్రమాల్లో చిరు-చరణ్-కొరటాల బిజీబిజీగా ఉన్నారు.