మెగా ఐక్య‌త త‌ధ్య‌మేనా?

Update: 2022-10-05 07:19 GMT
రాజ‌కీయాల‌కు స్వ‌స్తి ప‌లికిన మెగాస్టార్ చిరంజీవి త‌మ్మ‌డు..ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్థాపించిన పార్టీ వెనుక ఉన్నారా?  లేదా? అన్న‌ది ఇప్ప‌టికీ స్ప‌ష్ట‌త లేదు. మిగిలిన మెగా న‌టులంతా ప‌వ‌న్ కోసం మేమున్నామంటూ ముందుకొస్తున్నా?  చిరు మాత్రం ఇంకా మౌనాన్ని వీడలేదు. మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ మ‌ద్ద‌తు బాబాయ్ కి ఎప్పుడూ  ఉంటుంద‌ని బ‌హిరంగంగా చాలాసార్లు వెల్ల‌డించారు.

ఇక నాగబాబు ఇప్ప‌టికే పార్టీలో కొన‌సాగుతున్నారు. జ‌న‌సేన పార్టీపై వ‌స్తోన్న విమ‌ర్శ‌ల్ని ఎప్ప‌టిక‌ప్పుడు తిప్పికొడుతున్నారు. ప‌వ‌న్ అదేశించాలేగానీ  పార్టీ ప్ర‌చారం కోసం మెగా క్యాంప్ దూసుకురావ‌డానికి రెడీగా ఉంది. 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలోనే చ‌ర‌ణ్ రంగంలోకి దిగుతానంటూ ప‌వ‌న్ వ‌ద్ద‌ని వారించిన‌ట్లు వినిపించింది.

బాబాయ్ మాట‌కి క‌ట్టుబ‌డి అప్పుడు చ‌ర‌ణ్ సీన్ లోకి రాలేదు. తాజాగా ఏపీలో ఎన్నిక‌లు స‌మీపిస్తోన్న నేప‌థ్యంలో ఈసారి మెగా హీరోలంతా  రింగులో కి  ద‌గ‌డానికి రెడీగా ఉన్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. ఇటీవ‌లే మెగాస్టార్ చిరంజీవి త‌మ్ముడ్ని ఉద్దేశించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. పవన్ నిజాయితీ.. నిబద్ధత తనకు చిన్ననాటి నుంచి తెలుసన్నారు. ఫ్యూచర్ లో జనసేనకు మద్దతు ఇస్తానో లేదో తెలియదన్నారు.

తాము చెరోవైపు ఉండటం కంటే తాను తప్పుకోవడమే మంచిద‌ని నిర్ణయించుకున్నట్లు చిరు పేర్కొన్నారు. పవన్ కు నాయకత్వ పఠిమ ఉందని భవిష్యత్తులో తప్పకుండా మంచి నాయకుడు అవుతాడని అన్నారు. అంతే కాకుండా రాష్ట్రాన్ని ఏలే సామర్థ్యం పవన్ కు ఉందంటూ తెలిపారు. పవన్ మంచి స్థాయికి ఎదగాలని ఆశిస్తున్నానని ఆయన తెలిపారు.

తాను పాలిటిక్స్ నుంచి ఎగ్జిట్ అయి సైలెంట్‌గా ఉన్నానన్నారు. మీరు పార్టీకి మ‌ద్ద‌తిస్తున్నార‌ని అని చిరుకి ఎదురైన ప్ర‌శ్న‌కు ఆర‌కంగా స‌మాధానం వ‌చ్చింది. అయితే త‌న మ‌ద్ద‌తు పార్టీకి ఉంటుందా? ఉండ‌దా? అన్న దానిపై మెగాస్టార్ మ‌రోసారి అస్ప‌ష్టంగానే సందించిన‌ట్లు క‌నిపిస్తుంది. ఈ విష‌యంలో మెగాస్టార్ తొలి నుంచి ఇదే విధం గా స్పందిస్తున్నారు.

మ‌ద్ద‌తిస్తాను అన‌డం లేదు..ఇవ్వ‌న‌ని క‌రాఖండీగా చెప్ప‌డం లేదు. రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ద్వంద్వ వైఖ‌రి ప్ర‌ద‌ర్శిస్తున్నారు. మ‌రి జ‌న‌సేన ఎన్నిక‌ల ప్ర‌చార స‌మ‌యానికైనా క్లారిటీ ఇస్తారా? అప్పుడు ఇదే విధంగా స్పందిస్తారా?  లేక  వెనుకుండి రాజ‌కీయ చ‌క్రం తిప్పుతారా? అన్నది చూడాలి. ఏది ఏమైనా మెగాస్టార్ మ‌ద్ద‌తు మాత్రం జ‌న‌సేన‌కు ఎంతైనా అవ‌స‌రం అన్న‌ది అభిమానుల మాట‌గా బ‌లంగా వినిపిస్తుంది. చిరంజీవి ఇప్ప‌టికే ప్ర‌జారాజ్యం  పార్టీని స్థాపించి అటుపై పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన సంగ‌తి తెలిసిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News