పరిశ్రమ ఫోర్ పిల్లర్స్ లో సాటి పిల్లర్స్ ఏజ్ తెలిసిపోతుంటే మెగా బాస్ మాత్రం ఇంకా యంగ్ గా కనిపిస్తున్నారు. ఇన్నాళ్లు నవమన్మధుడిలా ఏలిన ఫ్రెండు నాగార్జున సైతం తెల్లగా పండిన వెంట్రుకలతో కనిపిస్తుంటే చిరు ఏంటి ఇలా టీనేజీ లుక్ కి మారిపోతున్నారు. బాస్ లో కమిట్ మెంట్ డెడికేషన్ గురించి ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవ్ కానీ మరీ ఇంత టూమచ్ గా యంగ్ రూపం ఎలా సాధ్యం? అంటూ యువతరం ఒకటే కన్ఫ్యూజ్ అయిపోతున్నారు.
నేటితరం 30 ప్లస్ కే చేతులెత్తేస్తుంటే చిరు ఏంటి 16 మైనస్ లా మరిపించేస్తున్నారు? మెగాస్టార్ తాజా గెటప్ చూసి అంతా స్టన్నవుతున్నారు. 60 ప్లస్సా? 16 మైనస్సా? ఏంటిది బాసూ లుక్స్ అదుర్సు! అంటూ కితాబిచ్చేస్తున్నారు. అరవైలలో ఉన్నా మెగాస్టార్ చిరంజీవి గతంలో కంటే అందంగా కనిపిస్తున్నారు. ఓవైపు కెరీర్ పరంగానూ అంతే స్పీడ్ గా ఉన్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో యువ హీరోలకు గట్టి పోటీనిస్తున్నారు. అసలు ఆయన స్పీడేంటో కానీ ఎవరికీ అర్థం కాదు.
చిరు తాజా ఫోటోషూట్ మైండ్ బ్లాక్ చేస్తోంది. ఈ ఫోటోలనుంచి కళ్లు తిప్పుకోవడం అంత సులువేమీ కాదు. చిరు పోలో టీ షర్టులు.. డెనిమ్ జీన్స్ ధరించి కాలేజ్ బోయ్ లా కనిపిస్తున్నారు. మాస్టారు కాస్తా క్లాస్ రూమ్ కి ప్రమోటైనట్టుగా ఉంది వ్యవహారం అంటూ కితాబిచ్చేస్తున్నారు. ఇటీవల వైజాగ్ లో చిరంజీవి డిటాక్స్ ప్రోగ్రామ్ లో ఉన్నారని.. ఆయుర్వేదిక్ స్పా లో రీఫ్రెష్ అవుతున్నారని కథనాలొచ్చాయి. ఇంతలోనే లేటెస్ట్ ఫోటోషూట్ తో మైండ్ బ్లాక్ చేసేశారు. ధగధగా మెరుస్తున్న చిరు ప్రకాశవంతమైన ముఖం వెనుక కారణం! డిటాక్స్ చికిత్స అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
చిరు తదుపరి వరుసగా మూడు చిత్రాలు చేయాల్సి ఉంది. మోహనరాజా దర్శకత్వం వహిస్తున్న లూసిఫర్ రీమేక్ లో చిరు ఈ కొత్త రూపాన్ని ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. చిరు ప్రస్తుతం నటించిన ఆచార్య విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ రెండు ప్రాజెక్ట్ లతో పాటు మెహర్ రమేష్ - బాబీతో సెట్స్ కెళ్లాల్సి ఉంది.