మెగాస్టార్ డ‌బుల్ ధ‌మాకా ట్రీట్

Update: 2019-11-06 07:48 GMT
చిరంజీవి మెగాస్టార్ గా త‌న‌ని తాను ఆవిష్క‌రించుకునేందుకు ఎంతో శ్ర‌మించారు. ఎన్నో సాహ‌సాలు చేశారు. అంత‌కుమించి ఎన్నో ప్ర‌యోగాలు చేశారు. దాదాపు 25 ఏళ్లుగా తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో మెగాస్టార్‌గా జేజేలు అందుకుంటూనే ఉన్నారు అంటే ఈ హార్డ్ వ‌ర్క్ పుణ్య‌మే.

శ‌తాధిక చిత్రాల హీరోగా రాణించి.. ఇప్పుడు ఏకంగా 152వ చిత్రంలో న‌టించేందుకు రెడీ అవుతున్న‌ విష‌యం తెలిసిందే. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌పైకి రాబోతున్న ఈ చిత్రంలో చిరు ద్విపాత్రాభిన‌యంలో క‌నిపించ‌బోతున్నారు. దాదాపు ప‌దేళ్ల విరామం త‌రువాత 'ఖైదీ నంబ‌ర్ 150' తో రీ ఎంట్రీ ఇచ్చిన చిరు ఈ సినిమాలో ద్విపాత్రాభిన‌యం చేసిన విష‌యం తెలిసిందే. 151వ సినిమా 'సైరా: న‌ర‌సింహారెడ్డి' త‌రవాత చిరు చేయ‌బోతున్న సినిమాలో మ‌రోసారి ద్విపాత్రాభిన‌యం చేయ‌బోతున్నారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న ద్విపాత్రాభిన‌యంలో వ‌చ్చిన చిత్రాల జాబితా ప‌రిశీలిస్తే చాలా పెద్ద‌దే ఉంది. తొలిసారి చిరు 'న‌కిలీ మ‌నిషి' చిత్రంలో చిత్రంలో ద్విపాత్రాభిన‌యం చేశారు. ఇందులో హీరోగా.. విల‌న్‌గా రెండు పాత్ర‌ల్లోనూ క‌నిపించి ఆక‌ట్టుకున్నారు. ఆ త‌రవాత1982లో వ‌చ్చిన 'బిల్లా- రంగా'.. 1983లో వ‌చ్చిన 'శివుడు శివుడు శివుడు'.. సింహ‌పురి సింహం.. జ్వాల‌.. ర‌క్త సింధూరం..1987లో వ‌చ్చిన దొంగ‌ మొగుడు.. 1988లో వ‌చ్చిన 'య‌ముడికి మొగుడు ఇవ‌న్నీ బ్లాక్ బ‌స్ట‌ర్లుగా నిలిచాయి. ఆ చిత్రాల్లో ద్వి.. త్రిపాత్రాభిన‌యానికి .. చిరు న‌ట‌న‌కు గొప్ప పేరొచ్చింది. ఆ త‌ర్వాతా ఆ త‌ర‌హా పాత్ర‌లు ఎన్నోసార్లు చేసి మెప్పించారు.

1991లో వ‌చ్చిన 'రౌడీ అల్లుడు'.. 1994లో వ‌చ్చిన 'ముగ్గురు మొన‌గాళ్లు'.. 1995లో వ‌చ్చిన `రిక్షావోడు`.. 1999లో వ‌చ్చిన `స్నేహం కోసం`.. 2005లో వ‌చ్చిన `అంద‌రివాడు`.. 2017లో వ‌చ్చిన `ఖైదీ నంబ‌ర్ 150` ఇలా చిరు ఇప్ప‌టి వ‌ర‌కు  14 చిత్రాల్లో ద్విపాత్రాభిన‌యం చేసి రికార్డు సృష్టించారు. కొర‌టాల‌తో చేయ‌బోతున్న సినిమాలో చిరు 15వ సారి ద్విపాత్రాభిన‌యం చేయ‌బోతున్నారు. ఒక న‌టుడు త‌న సుధీర్ఘ కెరీర్‌లో 15 సార్లు ద్విపాత్రాభిన‌యం చేయ‌డం తెలుగు సినీ చ‌రిత్ర‌లోనే కాదు భార‌తీయ సినీచ‌రిత్ర‌లో అరుదైన రికార్డ్.
Tags:    

Similar News