మెగాస్టార్ చిరంజీవి జా సేవా కార్యక్రమాలు అనితర సాధ్యమైనవి. చాలా మంది కువిమర్శకులకు ఇది చెంప పెట్టు లాంటి సమాధానం. సామాన్య ప్రజలకు తన అభిమానులకు ఏ కష్టం వచ్చినా ఆదుకునేందుకు నేను సైతం అంటూ చిరు ముందుకు వస్తారు. ఆ కుటుంబానికి అండగా నిలుస్తారు. ఇటీవల కరోనా క్రైసిస్ కష్ట కాలంలో పరిశ్రమలోని వారికి పరిశ్రమేతర వ్యక్తులకు అలాగే తెలుగు రాష్ట్రాల్లో అన్నిచోట్లా ప్రజలను కష్టంలో ఆదుకున్నారు. చాలా మందికి ఆపత్కాలంలో ఆర్థిక విరాళాల్ని అందించారు.
మెగాస్టార్ తాజాగా మరోసారి తన మంచితనం నిరూపించారు. తన అభిమాని చివరి కోరికను తీర్చారు. ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరుకు చెందిన నాగరాజు అనే వ్యక్తి మెగాస్టార్ కు వీరాభిమాని.
ఆ వ్యక్తికి రెండు కిడ్నీలు పాడైపోయాయని అతడు జీవించి ఉండడం కష్టమని డాక్టర్లు ధృవీకరించారు. అతడు చిరంజీవిని చివరిసారి చూడాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఈ వార్త ఆ నోటా ఈనోటా చివరికి చిరంజీవికి చేరింది.
వెంటనే తన అభిమాని కుటుంబాన్ని తన నివాసానికి ఆహ్వానించాడు. కిడ్నీలు చెడిపోయి ప్రాణాలతో పోరాడుతున్న అభిమాని నాగరాజు దీనస్థితిని చూసి చలించిపోయారు. ఆయనను ఆప్యాయంగా కౌగిలించుకుని కాసేపు మాట్లాడి నైతికంగా తన మద్ధతును అందించారు.
అంతేకాదు అతడి కుటుంబానికి ఆర్థిక సాయం కూడా అందించాడు. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నెటిజన్లు చిరు మంచి మనసుపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
మెగాస్టార్ ఇలాంటి దయార్థ్ర హృదయం చూపడం ఇదే మొదటిసారి కాదు. ముఖ్యంగా చిరంజీవి తన అభిమానులకే కాకుండా ఆపదలో ఉన్న చాలా మందికి అండగా నిలిచారు. రక్తదానం - కళ్ల దానం గురించి ఆయన విస్త్రత ప్రచారం చేస్తున్నారు. బ్లడ్ బ్యాంక్ ఐ బ్యాంక్ లు స్థాపించి విశిష్ఠ సేవలు చేస్తున్నారు. కరోనా క్రైసిస్ కాలంలో ఆక్సిజన్ బ్యాంకుల్ని స్థాపించి ఎందరో ప్రజల ప్రాణాల్ని కపాడారు. అందుకే మెగాస్టార్ జనహృదయాల్లో నిలిచి ఉన్నారు.