మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే ఇప్పటికి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మెగా ఫ్యాన్స్ ఆయన సినిమాల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆయన వరుసగా సినిమాలు చేసేందుకు రెడీ అయ్యారు. ప్రస్తుతం ఆచార్య సినిమాను చేస్తున్న చిరంజీవి వెంటనే తమిళ సూపర్ హిట్ మూవీ 'వేదాళం' ను రీమేక్ చేయబోతున్నాడు. మెహర్ రమేష్ దర్శకత్వంలో ఆ సినిమా రూపొందబోతుంది. ఆ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ వచ్చే ఏడాది ఆరంభంలోనే షురూ అయ్యే అవకాశం ఉందంటున్నారు. ఇక ఆ రీమేక్ కు టాలీవుడ్ యంగ్ మ్యూజిక్ కంపోజర్ వర్క్ చేయబోతున్నాడట.
సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ సంగీత సారధ్యంలో వేదాళం తెలుగు రీమేక్ రాబోతుందట. ఇప్పటికే ఆయనకు మెగాస్టార్ నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చిందట. చిరంజీవి సినిమా అంటే ఓ రేంజ్ ఉంటుంది. ఆ స్థాయిలో మ్యూజిక్ ఉండాలంటూ అభిమానులు ప్రేక్షకులు ఎదురు చూస్తూ ఉంటారు. మరి అంతటి స్థాయిని ఈ యువ సంగీత దర్శకుడు అందుకోగలడా అనేది చూడాలి. భారీ ఎత్తున అంచనాలున్న వేదాళం తెలుగు రీమేక్ ను వచ్చే ఏడాది దసరా వరకు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. వేదాళం రీమేక్ తో చిరంజీవి ఎలాంటి ఫలితాన్ని దక్కించుకుంటాడో కాని మహితి స్వర సాగర్ కు మాత్రం పెద్ద అగ్ని పరీక్ష అనడంలో సందేహం లేదు.