దగ్గుబాటి రానా - సాయిపల్లవి జంటగా నటిస్తున్న తాజా చిత్రం ''విరాటపర్వం''. 'రివల్యూషన్ ఈజ్ యాక్ట్ ఆఫ్ లవ్' అనేది దీనికి ఉపశీర్షిక. 'నీది నాది ఒకే కథ' ఫేమ్ వేణు ఊడుగుల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దగ్గుబాటి సురేష్ బాబు సమర్పణలో సురేష్ ప్రొడక్షన్స్ మరియు శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నక్సలైట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ మూవీలో కామ్రేడ్ రవన్న పాత్రలో రానా కనిపించనున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30న విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో 'విరాటపర్వం' టీజర్ ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేస్తారని చిత్ర బృందం ప్రకటించింది.
'విరాటపర్వం' టీజర్ మార్చి 18న సాయంత్రం గం. 5. 04 నిమిషాలకు చిరంజీవి చేతులు మీదుగా రిలీజ్ చేయబడుతుందని పేర్కొన్నారు. ఈ టీజర్ అనౌన్స్ మెంట్ ని చిత్ర యూనిట్ వైవిధ్యంగా ప్లాన్ చేసింది. సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా 'ఇందు మూలంగా యావన్ మంది ప్రజానీకానికి తెలియజేయడం ఏమనగా..' అంటూ దండోరా వేయిస్తూ టీజర్ అప్డేట్ ఇచ్చారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లిమ్స్ మరియు 'కోలు కోలు' సాంగ్ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇకపోతే ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం సమకూరుస్తున్నారు. డానీ సాంచెజ్ లోపెజ్ - దివాకర్ మణి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ఈ చిత్రంలో ప్రియమణి - నివేథా పేతురాజ్ - నందితా దాస్ - నవీన్ చంద్ర - ఈశ్వరీరావు - జరీనా వహాబ్ - సాయిచంద్ - బెనర్జీ - రాహుల్ రామకృష్ణ - నాగినీడు తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.
వీడియో కోసం క్లిక్ చేయండి