మెగాస్టార్‌ మరో కథ విన్నాడట!

Update: 2021-04-19 07:31 GMT
మెగాస్టార్‌ చిరంజీవి సైరా నరసింహా రెడ్డి తర్వాత స్పీడ్ పెంచారు. ప్రస్తుతం ఆయన చేస్తున్న ఆచార్య చివరి దశకు చేరుకుంది. ఒకటి రెండు వారాల షూటింగ్‌ బ్యాలన్స్ ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. ఆ వెంటనే లూసీఫర్ రీమేక్ ను చేసేందుకు ఇప్పటికే డేట్లు కూడా ఇచ్చేశాడు. మరో వైపు తమిళ మూవీ వేదాళం రీమేక్ ను చేసేందుకు మెహర్ రమేష్ తో స్క్రిప్ట్‌ రెడీ చేస్తున్నాడు. ఇక దర్శకుడు బాబీ చెప్పిన కథకు ఓకే చెప్పిన చిరంజీవి ఆ సినిమాను ఈ ఏడాది చివర్లో పట్టాలెక్కించేందుకు సిద్దం అవుతున్నాడు. అంటే మొత్తంగా నాలుగు ప్రాజెక్ట్‌ లు చిరంజీవి చేతిలో ఉన్నాయి. ఈ సమయంలో చిరంజీవి ఇంకా కథలు వింటూనే ఉన్నట్లుగా తెలుస్తోంది.

దర్శకుడు వంశీ పైడిపల్లి ఇటీవల మెగాస్టార్‌ చిరంజీవి కోసం ఒక కథను రాసుకున్నాడట. ఆ కథను వెళ్లి చిరంజీవి కి చెప్పడం కూడా జరిగిందట. కథ చెబుతున్నంత సేపు కూడా చాలా పాజిటివ్ గా చిరంజీవి స్పందించారని తప్పకుండా ప్రాజెక్ట్ ఓకే అవుతుందనే నమ్మకంను వంశీ పైడిపల్లి సన్నిహితుల వద్ద వ్యక్తం చేస్తున్నాడట. చిరంజీవి వయసుకు తగ్గ స్క్రిప్ట్‌ ను వంశీ తయారు చేశాడట. వచ్చే ఏడాది తప్పకుండా సినిమా ను చేసేందుకు చిరంజీవి డేట్లు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

వంశీ పైడిపల్లి చివరిగా మహేష్ బాబుతో మహర్షి సినిమాను చేశాడు. ఆ వెంటనే మరో సినిమాను మహేష్‌ బాబుతో చేసే అవకాశం వచ్చింది. మహేష్ బాబుతో ఒక మాఫియా బ్యాక్‌ డ్రాప్ సినిమాను చేయాలని వంశీ కథను కూడా సిద్దం చేసుకున్నాడనే వార్తలు వచ్చాయి. కాని ఏం జరిగిందో ఏమో కాని సరిలేరు నీకెవ్వరు తర్వాత సర్కారు వారి పాట మొదలు పెట్టాడు. ఆ తర్వాత అయినా వంశీకి డేట్లు ఇస్తాడా అంటే త్రివిక్రమ్ తో సినిమా కు ఓకే చెప్పాడు. ఆ తర్వాత రాజమౌళి సినిమా ఎలాగూ ఉంది. కనుక ఇప్పట్లో వంశీకి  డేట్లు ఇచ్చే అవకాశం లేదు. దాంతో వంశీ పైడిపల్లి మరో మార్గం అన్వేసిస్తూ మెగాస్టార్‌ చిరంజీవికి కథ చెప్పడం జరిగింది. అందుకు ఆయన నుండి గ్రీన్ సిగ్నల్‌ రావాల్సి ఉంది.
Tags:    

Similar News