వీడియో: రైతన్న‌కు మెగాస్టార్ సెల్యూట్

Update: 2021-12-24 06:40 GMT
రైతు దేశానికి వెన్నెముక‌. కానీ ఇప్పుడు ఆ రైతులే క‌నుమ‌రుగైపోతున్నారు. నిత్యం రైతు ఆత్మ‌హ‌త్యలు చూస్తూనే ఉన్నాం. ఎన్ని ప్ర‌భుత్వాలు మారినా రైతే రాజు అని ప్రోత్సాహించిన ప్ర‌భుత్వాలు ఎక్క‌డ‌? ప‌భుత్వాల మాట‌లు కోట‌లు దాట‌డం త‌ప్ప‌! వాగ్ధానాలు నెర‌వేరెదెప్పుడు? రైతులు గురించి గొప్ప‌గా లెక్చ‌ర్లు ఇవ్వ‌డం త‌ప్ప‌..వాటిని ఆచ‌ర‌ణ‌లో పెట్టేది ఎవ‌రు? ఇలా రైతు గురించి మాట్లాడుకుంటే రైతు క‌ష్టాలే క‌నిపిస్తాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవి సైతం రైత‌న్న‌ గొప్ప‌ద‌నం..ఔన్న‌త్యం గురించి జాతీయ రైతు దినోత్స‌వం సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ ఓ వీడియో సందేశాన్ని రిలీజ్ చేసారు.

``అలాగే మెగాస్టార్ ఇంటి పెర‌ట్లో ఆన‌ప‌కాయ గురించి చెప్పుకొచ్చారు. పెర‌ట్లో ఆన‌ప‌కాయ కాస్తేనే ఎంతో సంతోష‌మ‌నిపించింది. మ‌ట్టి నుంచి పండించి మ‌నంద‌రికీ అన్నం పెట్టే రైతు ఇంకెంత సంతోషంగా ఉండాలి. కానీ రైతు సంతోషంగా ఉండేలా మ‌న‌మే చూసుకోవాలి. వ్య‌వ‌సాయం చేస్తూ మ‌నంద‌రికీ సాయం చేస్తున్న ప్ర‌తీ రైతుకి నా సెల్యూట్ తెలియ‌జేస్తున్నా. అంతేకాదు ప్ర‌కృతి ఎంతో గొప్ప‌ది అంటే! మ‌నం స‌ర‌దాగా ఒక విత్త‌నం భూమిలో వేస్తే అది మ‌న‌కు కడుపు నింపే ప్ర‌య‌త్నం చేస్తుంది. అందుకు మ‌నం ఎంతో గొప్ప కృతజ్ఞ‌త‌గా ఉంటాం. మీరు కూడా మీ ఇంట్లో ఒక తొట్టిలో విత్త‌నం నాటండి. స్వ‌యంగా పండించిన కూర‌గాయ‌ల‌తో భోజ‌నం ఎంతో రుచిక‌రంగానూ..ఆరోగ్యంగానూ ఉంటుంద``న్నారు.

ఇక మెగాస్టార్ ఇంటి బ‌య‌ట ఖాళీ ప్ర‌దేశంలో ఆన‌ప‌కాయ పాదులు పెట్టి కాయ‌గూర‌లు పండించారు. పాదుల‌కు ఇనుప చ‌ట్రాల‌తో పందిరిలా త‌యారు చేసి ఆన‌ప‌కాయ సాగు చేసారు. పూర్తిగా సేంద్రియ ప‌ద్ద‌తిలోనే కాయ‌లు పండించార‌ట‌. ఎలాటి ఎరువులు వాడ‌కుండా స్వ‌చ్ఛ‌మైన సేంద్రియ గెత్తం వాడిన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ సిటీలో ఆర్గానిక్ ఫుడ్ కి మంచి డిమాండ్ ఉంది. చాలా మంది ప్ర‌ముఖులు వంద‌ల ఎక‌రాల్లో సేంద్రియ వ్య‌వ‌సాయం చేస్తున్నారు. లోక్ స‌త్తా జ‌య‌ప్ర‌కాష్ నారాయ‌ణ హైద‌రాబాద్ ఔట‌ర్ లో కొన్ని ఎక‌రాల్లో సేంద్రియ వ్య‌వ‌సాయం చేస్తున్నారు. ఇప్ప‌టి ప్ర‌భుత్వంలో కీల‌క పెద్ద‌లెంద‌రో వంద‌లాది ఎక‌రాల్లో సేంద్రియ వ్య‌వ‌సాయంలో త‌ల‌మున‌క‌లుగా ఉన్నారు. హైద‌రాబాద్ ఔట‌ర్ లో స్క్రింక్ల‌ర్ వ్య‌వ‌సాయం రేంజును ప‌రిశీలిస్తే క‌ళ్లు భైర్లు క‌మ్మే నిజాలెన్నో తెలుస్తాయి.




Full View
Tags:    

Similar News