సీఎం జగన్ తో మెగాస్టార్ కీలక భేటి?

Update: 2020-05-21 07:30 GMT
రాజకీయాల్లో మరో కీలక మలుపు. సినీ, రాజకీయ దిగ్గజాలైన చిరంజీవి, సీఎం జగన్ లు మరోసారి భేటి కాబోతున్నారు. పైకి నిపుణుల సలహాల స్వీకరణ అని చెబుతున్నా రాజకీయంగా ఏదో అలజడి. మెగాస్టార్ తో జగన్ భేటి వెనుక ఏమున్నదన్నది గండకోట రహస్యంగా మారింది. రాబోయే రోజుల్లో సినీ, రాజకీయ వర్గాల్లో ఏదో సంచలనం జరగబోతోందన్న చర్చ మొదలైంది.

ప్రస్తుత మహమ్మారి రాక వల్ల రెండు నెలలుగా నిర్బంధంతో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. ఇక అప్పుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మరింత దిగజారింది. రెవెన్యూ లేక రోజులు గడవడమే కనాకష్టంగా మారింది. దీంతో ఏపీ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టే చర్యలకు సీఎం జగన్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది ప్రముఖులతో.. పారిశ్రామికవేత్తలతో సీఎం జగన్ భేటి అవుతున్నారు. వారి దగ్గర నుంచి సలహాలు, సూచనలు స్వీకరించాలని నిర్ణయించారు.

తాజాగా ఏపీ ప్రభుత్వం నిర్బంధాలను తొలగిస్తూ భారీ సడలింపులు ఇచ్చింది. దీంతో దుకాణాలు, పరిశ్రమలు అన్ని తెరుచుకున్నాయి. సినిమా షూటింగ్ లకు కూడా జగన్ ప్రభుత్వం అనుమతులు ఇచ్చే యోచనలో ఉన్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవితో భేటి ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు జగన్ పెద్దపీట వేయబోతున్నారని తెలుస్తోంది.

మెగా స్టార్ చిరంజీవితోపాటు పలువురు సినీ ఇండస్ట్రీ పెద్దలు కూడా జగన్ తో ఈసారి సమావేశమవుతారని సమాచారం. ఈ సందర్భంగా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన పలు కీలక నిర్ణయాలు తీసుకుంటారనే చర్చ ఫిలింనగర్ లో సాగుతోంది. టాలీవుడ్ ను ఏపీకి షిఫ్ట్ చేసే యోచన కూడా ఈ భేటిలో ఉండబోతున్నదని టాక్.

చిరంజీవి-జగన్ భేటిపై తెలంగాణ సర్కారు ముందే అలెర్ట్ అయ్యింది. తాజాగా చిరంజీవి నివాసంలో సినీ పెద్దల తో తెలంగాణ మంత్రి తలసాని భేటి అయ్యారు. సినిమా షూటింగ్ లకు అనుమతి సహా ఇతర పెండింగ్ సమస్యలపై చర్చిస్తున్నారు.

ఇక సీఎం జగన్ తో భేటిలో ముఖ్యంగా సినిమా షూటింగ్ లకు అనుమతి.. నంది అవార్డుల విషయాన్ని సినీ పెద్దలు దృష్టికి తీసుకువస్తారని తెలుస్తోంది. సినిమా హాళ్ల ఓపెనింగ్, సినీ కార్మికులు, పరిశ్రమలకు రాయితీలు,ప్రోత్సాహకాలపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఈ వారంలోనే జరిగే చిరంజీవి-జగన్ భేటిపై సినీ, రాజకీయవర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
Tags:    

Similar News