టాలీవుడ్-కోలీవుడ్ మ‌ధ్య వ్య‌త్యాసం చెప్పిన మెగాస్టార్!

Update: 2022-10-15 08:12 GMT
'గాడ్ ఫాద‌ర్' హిట్ తో మెగాస్టార్ చిరంజీవి రెట్టించిన ఉత్సాహంలో ఉన్నారు. సినిమా స‌క్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. 'ఖైదీ నెంబ‌ర్ 150' త‌ర్వాత మెగాస్టార్ లో చూస్తోన్న ఉత్స‌హ‌మిది. 'ఆచార్య' ప్లాప్ తో ఎంత‌టి పెయిన్ కి గుర‌య్యారో? అంత‌కంత‌కు ఉత్సాహ 'గాడ్ పాద‌ర్' స‌క్సెస్ తో చిరంజీవిలో క‌నిపిస్తుంది. ఫెయిల్యూర్ నిరుత్సాహ ప‌రిస్తే..విజ‌యం ఉత్సాహాన్ని ఇస్తుంద‌ని మ‌రోసారి మెగాస్టార్ ని చూస్తే అర్ధ‌మ‌వుతుంది.

సినిమా రిలీజ్ కి ముందు..త‌ర్వాత కూడా మెగాస్టార్ జోరుగా ఇంట‌ర్వ్యూలు ఇస్తున్నారు. స‌క్సెస్ ఇచ్చిన ఉత్సాహంతోనే ఇదంతా జ‌రుగుతుంది. అయితే ఇది స్ర్టెయిట్ సినిమా హిట్ కాదు. మ‌ల‌యాళంలో హిట్ అయిన సూసీఫ‌ర్ ని గాడ్ పాద‌ర్ గా రీమేక్ చేసి చిరు స‌క్సెస్ సొంతం చేసుకున్నారు. తెలుగు నేటివిటీకి త‌గ్గ‌ట్టు క‌థ‌లో చాలా ర‌కాల మ‌ర్పులు చేసి తెర‌కెక్కించిన చిత్ర‌మిది.

ఈ నేప‌థ్యంలో చిరు రీమేక్ లు గురించి చిరంజీవి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు. రీమేక్ చేయ‌డం అంత వీజీ కాదు. రీమేక్ చేసేట‌ప్పుడు మ‌న అభిరుచులు మ‌ర్చిపోకూడ‌దు. మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని క‌థ‌లో మార్పులు చేయాలి. అక్క‌డే హీరో ఇమేజ్ ని బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. బాలీవుడ్ త‌ర్వాత అతి పెద్ద సినిమా మార్కెట్ టాలీవుడ్ సొంతం.

తెలుగులో ఇత‌ర క‌థ‌ల్ని య‌ధాత‌ధంగా తీస్తే చూడ‌రు. ముర‌గ‌దాస్  ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన 'ర‌మ‌ణ‌' లో విజ‌య్ కాంత్ హీరోగా న‌టించారు. ఆ సినిమా  క్లైమాక్స్  లో హీరో చ‌నిపోతాడు. కానీ అదే సినిమా ఠాగూర్ గా రీమేక్ చేసా. ఇక్క‌డ హీరో చ‌నిపోడు. అదే జ‌రిగితే తెర‌లు చిరిగిపోతాయి.  సినిమా హిట్ అవ్వ‌డానికి కార‌ణం 'ఠాగూర్' హీరో చనిపోకుండా ఉండ‌ట‌మే.

నేను అనే కాదు. తెలుగులో ఏ  హీరో సినిమా చేసినా?  అందులో  హీరో పాత్ర చ‌నిపోతే ప్రేక్ష‌కులు ఒప్పుకోరు. అదే జ‌రిగితే ఆ సినిమా ప్లాప్ అవుతుంది. నాగార్జున 'అంతం'..మ‌హేష్ 'బాబి'.. ప్ర‌భాస్ 'చ‌క్రం'లాంటి సినిమాల్ని ఉద‌హ‌రించారు.  త‌మిళ్ లో హీరో పాత్ర‌లు చినిపోయినా అక్క‌డి ప్రేక్ష‌కులు దాన్ని యాక్సప్ట్ చేస్తారు. ఇక్క‌డ‌ది జ‌ర‌గ‌దు.

రెండు భాష‌ల మ‌ధ్య ఉన్న ప్ర‌ధాన‌మైన వ్య‌త్యాసం అది' అన్నారు.  నిజ‌మే ఆ రెండు భాష‌ల్ని ముడిపెడితే చాలా తేడాలు క నిపిస్తాయి. అక్క‌డి ప్రేక్ష‌కుల్ని ఎంట‌ర్ టైన్ చేయాలంటే క‌థాబ‌లం ఉండాలి. ఇక్క‌డ హీరోలు ఇర‌గ‌దీయాలి. లేక‌పోతే సీన్ సితారైపోతుంది. అయితే గ‌తంతో పోల్చుకుంటే ఇప్పుడు తెలుగు ప్రేక్ష‌కుల్లో చాలా ర‌కాల‌ మార్పులొస్తున్నాయి. క‌థ‌లో కొత్త‌ద‌నం కోరుకుంటున్నారు. కంటెంట్ బేస్ట్ చిత్రాల‌కు పెద్ద పీట వేస్తున్నారు. కాంబినేష‌న్స్  కాదు క‌థ క‌థా బ‌లం ఉన్న సినిమాలు చేయండ‌ని చెప్పే స్థాయికి టాలీవుడ్ ఆడియ‌న్స్ ఎదిగారు అన్న‌ది గుర్తించాల్సిన అంశం.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News