కరోనా ఎఫెక్ట్‌తో పెండింగ్ పడ్డ ఆచార్య షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కాబోతున్నది. మెగాస్టార్ అతి త్వరలో మేకప్ వేసుకోనున్నాడు. ఒక్కసారి షూటింగ్ స్టార్ట్ చేశాక.. ఇక నిరంతరాయంగా షూటింగ్‌ను కొనసాగించాలని మెగాస్టార్ చిరంజీవి సూచిస్తున్నాడట. . సింగిల్ షెడ్యూల్‌లోనే షూటింగ్ అంతా పూర్తి చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆర్నెళ్లలోపే షూటింగ్ పూర్తిచేయాలని భావిస్తున్నారు. ఇందుకోసం చిరంజీవి కొరటాల శివకు బల్క్ డేట్స్ ఇచ్చేసాడు. నవంబర్ 9 నుంచే ఆచార్య సెట్ప్ పైకి వెళ్తుందనుకున్నా కూడా చిరంజీవి తనకు కరోనా వచ్చిందని స్వయంగా తెలిపాడు. కానీ అది తప్పుడు రిపోర్ట్ అని రెండు రోజుల తర్వాత తెలిసింది. దీంతో కొరటాల షెడ్యూల్ సిద్ధం చేసాడు.
ఇప్పటికే కొరటాల రెండేళ్లుగా ఇదే సినిమాపై ఉండటంతో ఇంకా వేచి చూపించకూడదని ఫిక్సయ్యాడు మెగాస్టార్. పైగా కాజల్ కూడా త్వరలోనే షూటింగ్ కు రానున్నది. ఇటీవలే పెళ్లి చేసుకున్న కాజల్.. హనీమూన్ నుంచి నేరుగా షూటింగ్‌కు రానున్నది.
నవంబర్ చివర్లో మొదలు షూటింగ్ మొదలు పెట్టి.. ఫిబ్రవరి చివరి వరకల్లా చిత్రీకరణ పూర్తి చేయాలని చూస్తున్నాడు.
మధ్యలో రామ్ చరణ్ కూడా ఈ చిత్రం కోసం 20 రోజులు డేట్స్ ఇవ్వనున్నాడు. సినిమాలో 27 నిమిషాల పాటు చరణ్ పాత్ర ఉంటుందని తెలుస్తుంది. అందులో 22 నిమిషాల వరకు చిరు, చరణ్ కాంబినేషన్ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. చాలా ఏళ్ళ తర్వాత చిరంజీవి సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో సూపర్ హిట్ ఆల్బమ్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకు అదనపు బలం కానుంది.