ప్రీరిలీజ్ లు సక్సెస్ మీట్లు అంటూ టాలీవుడ్ లో ఫంక్షన్లు గ్రాండ్ గా జరుగుతుంటాయి. ఏ ఇండస్ట్రీలో లేనంత ఘనంగా వేదికలను అలంకరించడం కూడా మన పరిశ్రమకే సాధ్యం. ఈ వేదికలపై గ్లామర్ తళుకులు మేకప్ గ్లిజ్ గురించి వర్ణిస్తే అది ఒక పుస్తకమే అవుతుంది. కేవలం హీరోయిన్లు మాత్రమే కాదు చాలా మంది సీనియర్ హీరోలు తమ ఏజ్ ని కనిపించనీయకుండా దాచేసేందుకు చాలానే శ్రమిస్తుంటారు. మేకప్ మేన్ తో కూచుని స్పెషల్ గా డెకరేట్ చేయించుకుని మరీ వేదికలను అలంకరిస్తుంటారు. కానీ బాస్ చిరంజీవి తీరే వేరబ్బా! ఆయన కూడా ఒక రజనీకాంత్ లాగా నేచురల్ గా సింపుల్ గా 'వాల్తేరు వీరయ్య' ఈవెంట్ కి ఎలాంటి హంగామా లేకుండా విచ్చేసిన తీరు చూస్తే ఆశ్చర్యం కలగక మానదు.
ఒక నల్ల చొక్కా కాంబినేషన్ డార్క్ కలర్ జీన్స్ ధరించి ఏమాత్రం హడావుడి లేకుండా చిరు ఈ వేదిక వద్దకు విచ్చేశారు. ఇక ఈ వేదిక పైకి వెళ్లాక ఆయన మెయింటెయిన్ చేసిన డిగ్నిటీ వేరే లెవల్. ఇక ఫన్ కంటెంట్ తో తన అభిమానులను ఉర్రూతలూగించారు చిరంజీవి. సింపుల్ కామెడీ టింజ్ తో ఆయన తనదైన శైలి అతిశయోక్తి లేని పంచ్ లతో అలరించారు. ముఖ్యంగా సింప్లిసిటీ ఈజ్ ది బెస్ట్ అని ఈ వేదికను పరిశీలించిన వారికి అర్థమవుతుంది.
చిరంజీవి తన ఫ్యాన్స్ మధ్య కూచుని ఈవెంట్ ఆద్యంతం ఆస్వాధించారు. వేడుకలో తన అభిమానులను చూసుకున్నప్పుడు అప్పుడప్పుడు కళ్లు చెమరుస్తుంటే చిరు కర్ఛీఫ్ తో ఆ ఆనందభాష్పాలను తుడుచుకుంటూ కెమెరాకి పదే పదే కనిపించారు. ఎందుకంటే 'వాల్తేరు వీరయ్య' అనే సినిమా కొందరు అభిమానులు కలిసి చేసిన సినిమా. విశాఖతోను చిరుకి ఉన్న అనుబంధం వేరు! ఇక్కడ ప్రజలను ఆయన అమితంగా ప్రేమిస్తారు. అందుకే బాబి తన ఫేవరెట్ బాస్ కి ఈ మూవీని ఒక గౌరవ కానుకగా సంక్రాంతి గిఫ్టుగా ఇవ్వాలని నిర్ణయించుకుని చేశారు. బాబి తో పాటు ఆల్మోస్ట్ మెజారిటీ పార్ట్ మెగాభిమానులే ఈ సినిమాకి పని చేయడంతో ఔట్ పుట్ పై టీమ్ ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉంది. అందుకే వాల్తేరు వీరయ్య సంక్రాంతి పందెంలో స్పెషల్ సినిమాగా నిలుస్తుందని మెగాభిమానులు భావిస్తున్నారు.
ఇకపోతే వాల్తేరు వీరయ్యగా మెగాస్టార్ సహజసిద్ధమైన లుక్ తో ఎలాంటి మేకప్ లేకుండా కనిపిస్తారని బాబి అండ్ టీమ్ స్పష్టం చేసింది. వీరయ్య ప్రీరిలీజ్ ఈవెంట్లో బాబి మాట్లాడుతూ మెగాస్టార్ ఇప్పటికీ అదే ఛామ్ ని కొనసాగిస్తున్నారని .. ఆయనను ఇంద్ర (2003) రోజుల్లో చూసినట్టే ఇప్పటికీ అందంగా ఉన్నారని ప్రశంసించారు. 20 ఏళ్ల తర్వాత కూడా బాస్ చిరంజీవి అదే ఛామ్ తో కనిపించారనేది కూడా బాబి పొగడ్త ఉద్ధేశం.
అంతేకాదు బాబి ఇంకో మాట కూడా అన్నారు. వితౌట్ డీఐ.. వితౌట్ ఫేసియల్స్ బాస్ చాలా అందంగా కనిపించారు.. అంటూ టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూని వివరించారు. అయితే చిరు ఇలా నేచురల్ లుక్ తో కనిపించడానికి కారణం చిరు తనయ కాస్ట్యూమ్ డిజైనర్ సుస్మిత గారి కృషి సాయమేనని కూడా బాబి తెలిపారు. నిజానికి చాలా మంది హీరోలకు పని చేసే మేకప్ డిపార్ట్ మెంట్ కి పని ఎక్కువ. ముఖంలో కొన్ని లోపాలను సవరించేందుకు ఏజ్ ని కవర్ చేసేందుకు నానా తంటాలు పడుతుంటారు.
విగ్గులు ఫేసియల్స్ అంటూ రకరకాల ఆర్టిఫిషియల్ ప్యాడింగ్ చాలా ఉంటుందని ఇండస్ట్రీకి చెందిన ఒక సీనియర్ మేకప్ మేన్ వెల్లడించారు. కానీ అలాంటి వేవీ బాస్ కి అక్కర్లేదని కూడా ఆయన అన్నారు. ఇక ఇదే వేదికపై కేథరిన్ థ్రెసా ఎంతో నేచురల్ లుక్ తో అందంగా కనిపిస్తే... ఊర్వశి రౌతేలా మాత్రం ఫుల్ మేకప్ కోటింగ్ తో ఒక బార్బీ రబ్బరు బొమ్మను తలపించిందని కూడా మెగాభిమానల్లో కామెంట్లు వినిపించాయి. ఇక దేవీశ్రీ ఈ వేదికపై ఎంతో నేచురల్ పెర్ఫామెన్స్ తో లైవ్ లో ఆకట్టుకున్నాడు. అప్పటికప్పుడు తనకు తట్టిన ఆలోచనలతోనే ఈవెంట్ ని చాలా జాయ్ ఫుల్ గా సాగించడంలో దేవీశ్రీ తనని కొట్టేవాళ్లే లేరు అని నిరూపించాడు. దేవీ లైవ్ వైర్ లాగా ఈ వేదికపై చాలా మ్యాజిక్ చేసారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.