'ఆచార్య' పై ఈ నెగెటివ్ బజ్ ఏంటి..??

Update: 2022-04-18 05:29 GMT
మెగాస్టార్ చిరంజీవి - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ''ఆచార్య'' సినిమా కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఇది తండ్రీకొడుకులు తొలిసారిగా కలిసి నటిస్తున్న పూర్తి స్థాయి మూవీ. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కింది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని, విడుదలకు సిద్ధమైంది. ఏప్రిల్ 29న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది.

రామ్ చరణ్ ఇప్పుడు 'ఆర్.ఆర్.ఆర్' సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకొని ఫుల్ జోష్ లో ఉన్నారు. దీన్ని 'ఆచార్య' చిత్రంతో కొనసాగించాలని భావిస్తున్నారు. అయితే దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి నెగిటివ్ సెంటిమెంట్ ఈ సినిమాపై పని చేస్తుందేమో అని మెగా అభిమానులు కలవరపడుతున్నారు.

జక్కన్నతో సినిమా చేసి సక్సెస్ అందుకున్న హీరోలు ఎవరైనా.. ఆ తర్వాత వెంటనే ప్లాప్ అందుకుంటారని.. విజయం కోసం కొన్నాళ్లపాటు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూడాలనే బ్యాడ్ సెంటిమెంట్ ఇండస్ట్రీలో ఉంది. ఇదే నిజమే అన్నట్లు ఇప్పటి వరకు ప్రతీ హీరో కూడా ఈ సెంటిమెంట్ కు బలయ్యారు.

ఇప్పుడు RRR తర్వాత చరణ్ కనిపించనున్న సినిమా 'ఆచార్య'. ఓవైపు మెగా హీరోలిద్దరినీ ఒకే స్క్రీన్ పై చూడబోతున్నామని మెగా ఫ్యాన్స్ ఎంతో ఎగ్జైటింగ్ గా ఉన్నా.. మరోవైపు రాజమౌళి సెంటిమెంట్ ను తలచుకొని టెన్షన్ పడుతున్నారని తెలుస్తోంది. ఫలితం కొంచెం అటు ఇటు అయితే ఈ ప్రభావం చెర్రీతో పాటుగా చిరు మీద కూడా పడుతుంది.

చిరంజీవి చివరి సినిమా 'సైరా నరసింహా రెడ్డి' పాన్ ఇండియా వైడ్ విడుదలై, ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అందుకే ఈసారి 'ఆచార్య' చిత్రంతో భారీ హిట్ కొట్టాలని వారు కోరుకుంటున్నారు. మరి ఇప్పుడు దర్శకధీరుడి సెంటిమెంటుకు ఎదురెళ్లి మెగా తండ్రీ కొడుకులు హిట్ అందుకుంటారో లేదో చూడాలి.

ఇకపోతే 'ఆచార్య' నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రచార చిత్రాలు - గ్లిమ్స్ - టీజర్ - ట్రైలర్ అభిమానులను ఆకట్టుకున్నాయి. అలానే మూడు పాటలు అలరించగా.. సోమవారం సాయంత్రం 'భలే భలే బంజారా' అనే నాలుగో సాంగ్ ని రిలీజ్ చేస్తున్నారు. ఇందులో చిరు - చరణ్ కలిసి స్టెప్పులు వేయడం విశేషం.

హైదరాబాద్ లో ఏప్రిల్ 23న 'ఆచార్య' ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ని గ్రాండ్ గా నిర్వహించడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీనికి బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ ఖాన్‌ చీఫ్ గెస్ట్‌ గా హాజరు కానున్నారని టాక్ వినిపిస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక వివరాలు తెలియాల్సి ఉంది.

'ఆచార్య' చిత్రాన్నినక్సలిజం బ్యాక్ డ్రాప్ లో సందేశాత్మక అంశాలతో కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్నారు. ఇందులో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్.. చరణ్ కు జోడీగా పూజా హెగ్డే హీరోయిన్లుగా నటించారు. సోనూసూద్ - జిషు సేన్ గుప్తా - వెన్నెల కిశోర్ - పోసాని కృష్ణ మురళి - తనికెళ్ళ భరణి - సౌరవ్ లోకేష్ - అజయ్ ఇతర పాత్రలు పోషించారు.

కొణిదెల ప్రొడక్షన్స్ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం సమకూర్చగా.. తిరునవుక్కరసు సినిమాటోగ్రఫీ అందించారు. సురేష్ సెల్వరాజన్ ప్రొడక్షన్ డిజైనింగ్ చేయగా.. నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు.
Tags:    

Similar News