ట్రైలర్ టాక్: మెహబూబా.. అరిపించాడబ్బా!!

Update: 2018-04-09 12:54 GMT


చాలా రోజులు తరువాత పూరి జగన్ లో పెనుమార్పులు చెందిన దర్శకుడిని చూస్తున్నట్లు అనిపిస్తోంది. మనోడు ఈ మధ్యకాలంలో తీసిన సినిమాలన్నీ ఢమేల్ అనేశాయి. ఒక టెంపర్ తప్పిస్తే.. ఆయన ఆఖరి పది సినిమాలూ పెద్దగా అలరించలేదు. అటువంటి టైములో తన కొడుకును హీరోగా పెట్టి తనే ఒక సినిమా తీస్తున్నాడంటే.. చాలా సందేహాలు వచ్చాయి. కాని వాటిల్ని పటాపంచలు చేశాడు ఈ క్రియేటివ్ డైరక్టర్.

'మెహబూబా' సినిమాతో తన కొడుకు ఆకాష్‌ ను హీరోగా అలాగే నిత్యా షెట్టి అనే అమ్మాయిని హీరోయిన్ పరిచయం చేస్తున్నాడు. ఏమో అనుకున్నాం కాని.. ఈ సినిమా టీజర్ తో ఇంప్రెస్ చేశాక ఇప్పుడు ట్రైలర్ తో కట్టిపాడేశాడు పూరి జగన్. తన పదునైన డైలాగులు.. అలాగే ఇండియా పాకిస్తాన్ బోర్డర్ లో ఆర్మీ నీడలో జరిగే సన్నివేశాలు.. ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్ సీన్లు.. మధ్యలో అందరికీ తెలిసిన ఒక హిందూ ముస్లిం ప్రేమ కథ.. అబ్బో అరిపించాడంతే. ఇక ఆకాష్‌ కూడా ఏమీ తక్కువ కాదులే.. మొన్నటివరకు చిన్నపిల్లాడిలా కనిపించిన ఈ కుర్రాడు.. ఇప్పుడు మాస్ హీరోలా అదరగొట్టేశాడు. డైలాగ్ డెలివరీ అతనికి చాలా ప్లస్సవుతుంది. నిత్యా లుక్స్ కూడా చాలా బాగున్నాయ్. ఓవరాల్ పూరి ఇప్పుడు హిట్టు కంటెంటుతో రంగంలోకి దిగుతున్నట్లే ఉన్నాడు.

ఇక సినిమాకు సందీప్ చౌతా అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్.. జానీ షేక్ అందించిన ఆర్ట్ డైరక్షన్ ప్లస్సయితే.. విష్ణు శర్మ అందించిన సినిమాటోగ్రాఫకీ కూడా బాగుంది. అలాగే విజువల్ ఎఫెక్ట్స్ కూడా బాగానే వచ్చాయి. మరి ధియేటర్లలో సినిమా ఏ మేరకు మనస్సులను దోచుకుని సెన్సేషనల్ హిట్టవుతుందో చూడటం ఒకటే లేటు.

వీడియో కోసం క్లిక్ చేయండి


Full View
Tags:    

Similar News