'సోగ్గాడే చిన్న నాయనా' 'బంగార్రాజు' చిత్రాలతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు కల్యాణ్ కృష్ణ కురసాల.. ఇప్పుడు ''లంబసింగి'' సినిమాతో నిర్మాతగా అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయ్యారు. 'ఏ ప్యూర్ లవ్ స్టోరీ' అనే ట్యాగ్ లైన్ తో ఇటీవలే ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు.
''లంబసింగి'' మూవీతో భరత్ రాజ్ హీరోగా పరిచయమవుతుండగా.. ‘బిగ్ బాస్’ ఫేమ్ దివి వైధ్య కథానాయికగా నటించింది. 'గాలి పటం' ఫేమ్ నవీన్ గాంధీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కల్యాణ్ కృష్ణ సమర్పిస్తున్న ఈ సినిమాని కాన్సెప్ట్ ఫిలిమ్స్ బ్యానర్ పై జీకే మోహన్ నిర్మింస్తున్నారు.
ఇటీవలే రిలీజ్ చేసిన ‘లంబసింగి’ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలు పెట్టారు. కింగ్ అక్కినేని నాగార్జున తాజాగా సినిమాలోని 'నచ్చేసిందే నచ్చేసిందే' అనే ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు.
'నచ్చేసిందే.. నచ్చేసిందే.. నాకెంతో నచ్చిందే ఈ పిల్లా.. నవ్వేసిందే.. నవ్వేసిందే.. నా మనసే తవ్వేసిందే ఇలా..' అంటూ సాగిన ఈ పాట శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటోంది. RR ధ్రువన్ ఈ మెలోడీకి ఫ్రెష్ ట్యూన్ కంపోజ్ చేయగా.. సిద్ శ్రీరామ్ తనదైన గాత్రంతో మరోసారి మెస్మరైజ్ చేసాడు. దీనికి కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు
హీరోయిన్ ప్రేమ కోసం తపించే హీరో.. ఆమెను ఫాలో అవుతూ తనలోని భావాలను ఈ పాట రూపంలో తెలియజేస్తున్నాడు. విజువల్ గానూ 'నచ్చేసిందే నచ్చేసిందే' పాట చాలా బ్యూటీఫుల్ గా ఉంది. కె బుజ్జి ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ నిర్వహించగా.. కె విజయ్ వర్ధన్ ఎడిటింగ్ వర్క్ చేశారు.
Full View

వైజాగ్ పరిసరాల్లోని అందమైన ప్రాంతాల్లో లంబసింగి ఒకటి. దీన్ని 'కాశ్మీర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్' అని పిలుస్తుంటారు. వేసవి కాలం - చలికాలంలో అత్యంత ఎక్కువమంది వీక్షించే ప్రదేశం ఇది. ఫస్ట్ లుక్ మరియు లేటెస్టుగా వచ్చిన 'నచ్చేసిందే' పాటని బట్టి చూస్తే ఈ ప్రాంతం చుట్టూ తిరిగే యూత్ ఫుల్ - డీసెంట్, క్లీన్ లవ్ స్టోరీ అని అర్థం అవుతుంది. కళ్యాణ్ కృష్ణ నిర్మాతగా 'లంబసింగి' చిత్రంతో ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి