గత కొన్ని రోజులుగా నిర్మాతల మండలికి ఎన్నికలు జరిపించాలని, సర్వ సభ్య సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం కొత్త బాడీ ఎన్నిక కోసం ముందుకు రావాలని నిర్మాతల మండలి సబ్యులు ధర్నాకు దిగారు. ప్రస్తుత ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షుడు నిరంకుశంగా వ్యవహరిస్తూ తన పదవీ కాలం ముగిసినా ఎన్నికలని నిర్వహించకుండా అడ్డుపడుతున్నాడని ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
అయితే దీనిపై సి. కల్యాణ్ ఇటీవల స్పందించి ఏదైనా వుంటే కమిటీలో చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు. కానీ ఎన్నికల గురించి మాత్రం ఎక్కడా ప్రస్తావించకపోవడంతో సర్వసభ్య సమావేశం కోసం నిర్మాతల మండలి సబ్యులు గత కొన్ని రోజులుగా పట్టబడుతున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా నిర్మాతల మండలి సర్వసబ్య సమావేశాన్ని ప్రస్తుత అధ్యక్షుడు సి. కల్యాణ్ అధ్యక్షతన ప్రారంభించారు.
ఈ సమావేశం రసాభాసగా మారింది. పదవీ కాలం ముగిసినా ఎన్నికలు నిర్వహించడం లేదని పలువురు సభ్యులు నిర్మాతల మండలి అధ్యక్షుడు సి. కల్యాణ్ పై తీవ్రాగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ నిర్మాతల మండలికి ఎన్నికలు నిర్వహించాల్సిందేనంటూ అధ్యక్షుడు సి. కల్యాణ్ తో సభ్యులు వాగ్వాదానికి దిగారు.
ఈ మొత్తం వ్యవహారాన్ని ఓ సభ్యుడు వీడియో తీస్తుండం గమనించిన సి. కల్యాణ్ అసహనాన్ని వ్యక్తం చేశారట. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుందని తెలిసింది.
గత కొన్ని రోజులుగా పలువురు నిర్మాతల మండలి సభ్యులు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కు ఎన్నికలు జరిపించాలని, డిజిటల్ ప్రొడవైడర్స్ వీపీఎఫ్ చార్జెస్ తగ్గించాలంటూ ఫిల్మ్ నగర్ లో దీక్ష చేస్తున్నారు. ఎన్ని రోజులైనా అధ్యక్షుడు సి. కల్యాణ్ నుంచి స్పందన లేకపోవడంతో తాజాగా జరిగిన సర్వసభ్య సమావేశంలో పెద్ద రచ్చ చేశారు. దీంతో నిర్మాతల మండలి సమావేశం రసాభాసగా మారింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.