చాలా ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా.. టాలెంట్ ఉన్నా.. ఆశించిన స్థాయిలో పేరు సంపాదించలేకపోయాడు శ్రీవిష్ణు. ఐతే ‘అప్పట్లో ఒకడుండేవాడు’ అతడి రాతను మార్చేసింది. ఒక ఇమేజ్ ఉన్న హీరో చేయాల్సిన పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించాడు శ్రీవిష్ణు. ఈ సినిమా తర్వాత అతడి ఇమేజే మారిపోయింది. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఈ ఊపులో వరుసగా సినిమాలు కమిటవుతున్నాడు శ్రీవిష్ణు.
‘పెళ్లిచూపులు’ సినిమాతో నిర్మాతగా తన అభిరుచిన చాటుకున్న రాజ్ కందుకూరి శ్రీవిష్ణు హీరోగా ‘మెంటల్ మదిలో’ సినిమాను నిర్మిస్తున్నాడు. వివేక్ ఆత్రేయ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ‘ఓకే బంగారం’ సినిమాలో పాపులరైన పాటలోని పల్లవిని తీసుకుని ఈ చిత్రానికి టైటిల్ గా పెట్టుకున్నారు. బుద్ధుడిలా శ్రీవిష్ణు కూర్చుని ఉన్న చిత్రంతో ఒక ప్లెజెంట్ ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ చేసి సినిమా మీద పాజిటివ్ ఇంప్రెషన్ కలిగేలా చేసింది ఈ చిత్ర యూనిట్. టైటిల్.. ఫస్ట్ లుక్ చూస్తుంటే ఇదొక ప్లెజెంట్ లవ్ స్టోరీలాగా కనిపిస్తోంది.
మరోవైపు ఇంద్రసేన అనే కొత్త దర్శకుడితో ఒక మల్టీస్టారర్ మూవీ కూడా చేస్తున్నాడు శ్రీవిష్ణు. ఇందులో ఒక స్టార్ హీరో.. ఇంకో ఇద్దరు యువ కథానాయకులు.. ఒక కథానాయిక నటిస్తుందట. ఇది కాక శ్రీవిష్ణు హీరోగా ఇంకో సినిమా కూడా సెట్స్ మీద ఉంది. మొత్తానికి శ్రీవిష్ణు హీరోగా బాగానే నిలదొక్కుకుంటున్నట్లున్నాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/