బిగ్ బాస్ 9లో స‌న్నిలియోన్ చెల్లి

Update: 2015-09-15 19:30 GMT
బిగ్ బాస్ రియాల్టీ షో ను మరింత ర‌క్తి క‌ట్టించేందుకు నిర్వాహ‌కులు ర‌క‌ర‌కాల ఎత్తులు వేస్తున్నారు. గ‌తంలో ఈ షోకు విప‌రీత‌మైన క్రేజ్ వ‌చ్చేందుకు ప‌మేలా అండ‌ర్స‌న్‌, స‌న్నిలియోన్ వంటి అడ‌ల్ట్ సెల‌బ్రిటీల‌ను ఆహ్వానించిన నిర్వాహ‌కులు ఇప్పుడు మ‌రోసారి సూప‌ర్ క్రేజ్ ఉన్న 22 ఏళ్ల అడ‌ల్ట్ సెల‌బ్రిటీని ఆహ్వానిస్తున్నారు.  పాపులర్ అడల్ట్ స్టార్ మియా ఖలీఫాకు బిగ్ బాస్ 9 కార్య‌క్ర‌మంలో పాల్గోవాల‌ని నిర్వాహ‌కుల‌ నుంచి డీల్ వ‌చ్చింద‌ట‌.

స‌న్నిలియోన్‌ కు చెల్లిగా ప‌లువురు కీర్తించే మియా ఖ‌లీఫా ఇటీవ‌ల త‌న సొంత దేశ‌మైన లెబ‌నాన్ జాతీయ గీతంలోని తొలి వాఖ్యాన్ని త‌న చేతిమీద టాటూగా వేయించుకుంది. బుర‌ఖా ధ‌రించి పోర్న్ వీడియోలో కూడా క‌నిపించింది. ఈ పోర్న్ వీడియోకు ప్ర‌పంచ‌వ్యాప్తంగా అంతులేని రెస్పాన్స్ వ‌చ్చింది. మియా లెబ‌నీస్‌-అమెరిక‌న్ మోడ‌ల్‌, న‌టిగా కూడా ఆమెకు ఎంతో క్రేజ్ ఉంది. బుర‌ఖా ధ‌రించి వీడియోలో క‌నిపించ‌డంతో ఇది ముస్లింల‌ను అవ‌మాన‌ప‌రిచేలా ఉంద‌ని ఇస్లామిక్ మిలిటెంట్లు ఆమెను చంపేస్తామ‌ని హెచ్చ‌రిక‌లు కూడా జారీ చేశారు.

  చిన్న వ‌య‌స్సులోనే పాపుల‌ర్ పోర్న్‌ స్టార్‌ గా, మోడ‌ల్‌, న‌టిగా పేరున్న మియా ఖ‌లీపా అటు కాంట్ర‌వ‌ర్సీల్లో కూడా పాపుల‌ర్ అవ్వ‌డంతో ఆమె బిగ్ బాస్ 9లో ఉంటే ఈ ప్రోగ్రాంకు క్రేజ్ వ‌స్తుంద‌నే నిర్వాహ‌కులు ఆమెను అప్రోచ్ అయిన‌ట్టు తెలుస్తోంది. స‌న్నిలియోన్‌, ప‌మేలా అండ‌ర్స‌న్ లాంటి అడ‌ల్డ్ స్టార్ లు ఈ కార్య‌క్ర‌మానికి  ఓ రేంజ్‌ లో ఊపు తెచ్చారు. ఇప్పుడు వారిని మించిన కాంట్ర‌వ‌ర్సీల‌తో ఉన్న మియా బిగ్ బాస్ 9 షోతో ఎలా కిక్ ఇస్తుందో చూడాలి.
Tags:    

Similar News