హాలీవుడ్ బ్యూటీ.. లక్ష్మీ పూజ చేసింది

Update: 2017-02-07 07:37 GMT
హాలీవుడ్ బ్యూటీ మిలీ సైరస్.. సడెన్ గా హిందూ ట్రెడిషన్ ఫాలో అయిపోయి ఆశ్చర్యపరిచింది. మన దేశానికి వచ్చినపుడు హాలీవుడ్ నటులు స్పెషల్ పర్మిషన్ తీసుకుని గుళ్లు గోపురాలు చుట్టేస్తుంటారు. కానీ విదేశాల్లో తమ ఇంట్లోనే ఉంటూ.. హిందూ సాంప్రదాయాల ప్రకారం పూజలు చేయడం ఆశ్చర్యం కలిగించే విషయం.

హాలీవుడ్ సింగర్ కం యాక్టర్ అయిన మిలీ సైరస్.. తాజాగా తన ఇంట్లో లక్ష్మీ పూజ నిర్వహించింది. లక్ష్మీదేవి చిత్రంతో పాటు.. తన గురువుల ఫోటోలను కూడా చుట్టూతా చేర్చి.. ట్రెడిషనల్ గా లక్ష్మీ పూజ చేసింది. సూపర్ బౌల్ 2017 ఫుట్ బాల్ ఛాంపియన్ షిప్ లో.. ఈ భామ ఒక ప్రదర్శన ఇవ్వబోతోంది. ఈ షో సక్సెస్ కావాలంటూ లక్ష్మీ పూజ నిర్వహించింది మిలీ సైరస్. అచ్చు మన ఇళ్లలో మాదిరిగానే..  పూజ.. పీఠం.. పండ్లు.. పూలు.. నైవద్యాలు.. రాగి చెంబు.. కలశం.. ఇలా కంప్లీట్ గా హిందూ ట్రెడిషన్ ప్రకారం పూజ చేసి.. ఆ ఫోటోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది మిలీ సైరస్

అలాగే మరొక ఫోటోలో తన ఇంటి మొత్తాన్ని ఫ్లవర్ తో ఏ రేంజ్ లో డెకరేషన్ చేసిందో కూడా చూపించింది మిలీ. పూజ విషయంలోనే కాదు.. దాని కోసం ఈ భామ పక్కాగా అన్ని సంప్రదాయాలు పాటించి.. చివరకు హల్వాను నైవేద్యంగా సమర్పించి మరీ మొక్కులు మొక్కుకుందట. ఏం మొక్కుకుందనే విషయం మాత్రం మిలీ చెప్పలేదులే!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News