మిలింద్ సోమన్ మంచి నటుడు - మోడలింగ్ ప్రొఫెషన్ లో కూడా బాగా పాపులర్ అయ్యాడు. అతడి ఫిట్ నెస్ గురించయితే కొత్తగా చెప్పాల్సిన అవసరమే లేదు. అందుకే ఈసారి తన గురించి కాకుండా తన ‘తల్లి’ ఫిట్ నెస్ ని ప్రపంచానికి పరిచయం చేశాడు. మిలింద్ సోమన్ తన తల్లి వీడియోలు సోషల్ మీడియాలో పెట్టిన వీడియో ఒకటి ఇప్పటికీ వైరల్ అవుతోంది. ఆమె పేరు ఉష సోమన్. వయసు 81 ఏళ్ళు. ఆపకుండా అవలీలగా 16 పుష్-అప్స్ చేస్తుంది. కాళ్ళ మునివేళ్ళ మీద మోచేతుల మీద శరీరాన్ని గాల్లో తేలేలా చేస్తుంది. కోడలు అంకిత కొన్వర్ తో కలిసి ఒంటి కాలితో బాక్స్ జంప్స్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలు దేశంలోని మహిళలకు శారీరక వ్యాయామానికి సంబంధించి మంచి సందేశాన్నిస్తోంది.
చీర కట్టుకుని మామూలు గృహిణిలా కనిపిస్తున్న ఈ ముసలావిడ అసలు ముసలావిడలాగే లేదంటూ కాంప్లిమెంట్లు పడిపోతున్నాయి. ”ప్రతిఒక్కరూ ఇలా రోజుకు ఐదు లేదా పది నిమిషాల పాటు చేస్తే.. అందరూ ఆరోగ్యంగా సూపర్ ఫిట్ గా వుంటారు. నేను-మా అమ్మ కోరుకునేది కూడా అదే” అంటూ మిలింద్ సోమన్ ఇచ్చిన పిలుపు ఎంతమందిని కదిలిస్తుందో తెలీదు. అతడి ప్రయత్నం మాత్రం గొప్పది. మిలింద్ తల్లి ఉష ఇలాంటి సాహసం చేయడం ఇదే మొదటిసారి కాదు. 2017 మదర్స్ డే సందర్భంగా కూడా 80 సెకన్ల పాటు ఈ విన్యాసం చేసి ‘ఔరా’ అనిపించింది. గత 15 ఏళ్ల నుంచి నెలకు ఒక్కసారి మాత్రం ట్రాక్స్ మీదకెక్కి ఎక్సర్‌సైజ్ చేసే ఉషా సోమన్ ఇంత ఫిట్టుగా ఉంటే.. ప్రతిరోజూ కసరత్తు చేస్తే ఇంకెలా వుంటారో మరి! కోడలు అంకిత కొన్వర్ అత్తతో కలిసి చేసిన విన్యాసాలు ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసి అత్త నేను మీలా 80ఏళ్ళు బతికుంటే మీలాగే ఆరోగ్యాంగా ఉండాలని కోరుకుంటాను అని పోస్ట్ చేసింది. 80 దాటినా ముసలావిడ మహానుభావురాలే అంటూ నెటిజన్లు పొగుడుతున్నారు.