మిల్కీ బ్యూటీ తమన్నా 11th అవర్ వెబ్ సిరీస్ తో ఆహా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ వెబ్ సిరీస్ కోసం భారీగా ప్రచారం చేశారు. కాని ఆ వెబ్ సిరీస్ నిరాశ పర్చింది. తెలుగు ప్రేక్షకులు ఆ వెబ్ సిరీస్ ను ఆధరించలేదు. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ఆ వెబ్ సిరీస్ లేక పోవడం వల్లే ప్లాప్ అయ్యిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈమద్య కాలంలో సినిమాల్లో ఆఫర్లు లేక.. చేసిన వెబ్ సిరీస్ కూడా నిరాశ పర్చడంతో తమన్నా కాస్త నిరాశలో ఉంది. ఈ సమయంలో ఈమె నటించిన మరో వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు సిద్దం అయ్యింది. నేటి నుండి డిస్నీ + హాట్ స్టార్ లో తమన్నా ముఖ్య పాత్రలో నటించిన 'నవంబర్ స్టోరీ' ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
మొదటి వెబ్ సిరీస్ తో పోల్చితే తమన్నా ఈ వెబ్ సిరీస్ పై చాలా నమ్మకంగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు తాను ఇలాంటి కాన్సెప్ట్ తో సినిమా కాని వెబ్ సిరీస్ కాని చూడలేదని.. దర్శకుడు కథ చెప్పిన వెంటనే చాలా ఎగ్జైట్ అయ్యానంటూ చెప్పుకొచ్చింది. తప్పకుండా ఈ వెబ్ సిరీస్ అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుందనే నమ్మకంను ఆమె వ్యక్తం చేసింది. ఒక మర్డర్ కేసు నేపథ్యంలో సాగే ఈ వెబ్ సిరీస్ లో తమన్నా నటనకు కూడా మంచి స్కోప్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే విడుదల అయిన ట్రైలర్ ఆకట్టుకుంది. వెబ్ సిరీస్ పై ఒక వర్గం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది.
హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవ్వబోతున్న ఈ వెబ్ సిరీస్ కు రామ్ సుబ్రమణ్యన్ దర్శకత్వం వహించాడు. ఏడు ఎపిసోడ్స్ గా ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవ్వబోతుంది. తెలుగు తో పాటు తమిళం మరియు హిందీలో కూడా ఈ వెబ్ సిరీస్ అందుబాటులో ఉండబోతుంది. పాజిటివ్ టాక్ దక్కించుకుంటే ఇతర భాషల్లో కూడా దీనిని అందించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. తమన్నా హీరోయిన్ గా సుదీర్ఘ కాలం పాటు స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. ఈ వెబ్ సిరీస్ సక్సెస్ అయితే ఓటీటీలో మరికొంత కాలం కొనసాగే అవకాశం ఉంటుంది. ఒక వేళ ఈ వెబ్ సిరీస్ ఫలితం తారు మారు అయితే తమన్నా కెరీర్ ఎటువైపో..!