పాక శాస్త్ర నైపుణ్యంపై ఎన్ని యూట్యూబ్ చానెళ్లు వచ్చినా పెద్ద సక్సెసవుతున్నాయనేది ఒక సర్వే. ఇటీవలే జెమినీ టీవీ కోసం వంటల కార్యక్రమం మాస్టర్ చెఫ్ కి మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా హోస్టింగ్ చేయడం అది పెద్ద సక్సెస్ అవ్వడం తెలిసిందే. కానీ ఏం జరిగిందో ఇంతలోనే ఈ షో హోస్ట్ గా ఉన్న తమన్నా స్థానంలో అనసూయ కొనసాగుతారని కథనాలొచ్చాయి.
ఆ క్రమంలోనే తమన్నాతో సమస్య ఏం వచ్చింది? అంటూ ఆరాలు మొదలయ్యాయి. తాజాగా తమన్నా తరపు లాయర్ తెరపైకి తెచ్చిన విషయాలు వింటే .. షో నిర్వాహకులతో తమన్నాకు పొసగడం లేదని అర్థమవుతోంది. తమన్నా తొలి డెబ్యూ షో ఇలా మధ్యంతరంగా వివాదాల్లోకి రావడంపైనా చర్చ సాగుతోంది. షోని నిర్వహిస్తున్న మేకర్స్ తో కలత చెందిందని తమన్నాకు.. టీమ్ కు మధ్య అంతా బాగా లేదని కథనాలొస్తున్నాయి. వృత్తిపరమైన అహేతుకత అనే టాపిక్ తో మేకర్స్‌పై తమన్నా దావా వేసే అవకాశం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. తమన్నా తరపు న్యాయవాది తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు.
``మాస్టర్ చెఫ్ -తెలుగు కార్యక్రమ హోస్టింగ్ కి బకాయిలు చెల్లించని కారణంగా యు ప్రొడక్షన్ హౌస్ ఇన్నోవేటివ్ ఫిల్మ్ అకాడమీ పై తమన్నా భాటియా చట్టపరమైన చర్య తీసుకోవలసి వస్తుంది. నిరంతరాయంగా చెల్లింపులు చేయకపోవడం సరికాదు. వృత్తిపరంగా నిబద్ధతతో ఆమె ఇతర కమిట్ మెంట్ లను రద్దు చేసుకుంది. మాస్టర్ చెఫ్ మొత్తం ప్రాజెక్ట్ ను పూర్తి చేయాలని నిర్ణయించుకుంది. అయితే ప్రొడక్షన్ హౌస్ రాత్రికి రాత్రే ఆమెతో కమ్యూనికేట్ చేయడం ఆపివేసినందున ఆమె ఇప్పుడు వారిపై చట్టపరమైన దావా వేసేందుకు సిద్ధం కావాల్సి వచ్చింది`` అని తెలిపారు.
సౌత్ లో మాస్టర్ చెఫ్ తెలుగు వెర్షన్ కి తమన్నా .. తమిళ వెర్షన్ కి విజయ్ సేతుపతి హోస్టింగ్ చేస్తుండడంతో విపరీతమైన క్రేజు నెలకొంది. అయితే ఎంత ఘనంగా ప్రారంభించారో అంతే వేగంగా కోర్టు కేసుల వరకూ వెళ్లడం విచారించదగినది. హోస్టులతో సమస్య లేకుండా నిర్మాణ సంస్థ పరిష్కరించుకుంటారేమో చూడాలి. తమన్నా ఇటీవల సినిమాల్ని తగ్గించిన సంగతి తెలిసిందే. తదుపరి తెలుగు-తమిళంలో నటించేందుకు ప్రణాళికల్ని సిద్ధం చేస్తోందని సమాచారం.