డార్లింగ్ రెమ్యూనరేషన్ తెలిస్తే మైండ్ బ్లాంకే!

Update: 2019-07-30 11:14 GMT
ప్రభాస్ తాజా చిత్రం 'సాహో' విడుదల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  ప్రేక్షకుల ఆసక్తికి తగ్గట్టే 'సాహో' రిలీజ్ డేట్ దగ్గర పడేకొద్దీ ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడవుతున్నాయి.  'సాహో' షూటింగ్ కోసం దాదాపుగా 120 కార్లు వాడడం జరిగిందనే విషయం ఇప్పటికే అందరినీ షాక్ కు గురిచేసింది.  అంతే కాదు ఈ సినిమాకోసం అత్యధికంగా 80 సెట్లు వేశారట.. దాదాపు అధిక భాగం సీన్లలో ప్రేక్షకులు చూడబోయేవి డిఫరెంట్ గా ఉండే సెట్లేనని సమాచారం.  కానీ ఏవి సెట్స్..ఏవి కాదు అనేది ఎవరైనా చెప్తే తప్ప ప్రేక్షకులు కనుక్కోలేని విధంగా ఉంటాయట.

ఇది సెట్ల గురించి కొత్త ఇన్ఫో.  మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ కూడా ఉంది.  అదే ప్రభాస్ రెమ్యూనరేషన్. ఈ సినిమా రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే సాధారణ ప్రేక్షకులే కాదు.. టాలీవుడ్ హీరోలు కూడా షాక్ తింటారట.  ఆ స్థాయిలో ప్రభాస్ కు రెమ్యూనరేషన్ గిట్టుబాటు అవుతుందని సమాచారం.  ఈ సినిమాకు నిజానికి ప్రభాస్ రెమ్యూనరేషన్ ఇంకా తీసుకోలేదు.  ఇంత అని ఒక ఫిగర్ కూడా ఫిక్స్ కాలేదు.  'సాహో' టోటల్ ప్రీరిలీజ్ బిజినెస్ లో యాభై శాతం ప్రభాస్ కు ఫీజుగా చెల్లిస్తారని అంటున్నారు.  

ఈ సినిమా నిర్మాతలు వంశీ.. ప్రమోద్.. హీరో ప్రభాస్ కు సన్నిహిత మిత్రులనే విషయం తెలిసిందే.  ఈ సినిమా ప్రభాస్ కు సొంత సినిమా లాంటిదే.  అందుకే ప్రభాస్ రెమ్యూనరేషన్ విషయంలో ఇలా ఒప్పందం కుదిరిందట.  ఈలెక్కన 'సాహో' అన్ని భాషల థియేట్రికల్ రైట్స్.. శాటిలైట్ రైట్స్.. డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్.. డబ్బింగ్ రైట్స్.. ఇతర రైట్స్ అన్నీకలిపి ఎంత బిజినెస్ జరుగుతుందో ఆ మొత్తంలో 50% ప్రభాస్ రెమ్యూనరేషన్.  'సాహో' ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఇంకా పూర్తిగా బయటకు రాలేదు కాబట్టి ప్రభాస్ రెమ్యూనరేషన్ ఎంతో ఇప్పుడే ఖచ్చితంగా చెప్పడం కష్టం.  

అయితే ప్రభాస్ రెమ్యూనరేషన్ టాలీవుడ్ లో హయ్యెస్ట్ అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. అంతే కాదు ఇండియాలో మొత్తం మీద హీరోలు తీసుకునే హయ్యెస్ట్ రెమ్యూనరేషన్స్ లో ఒకటిగా ఉంటుందనే మనం ఫిక్స్ అయిపోవచ్చు. మరి ప్రభాస్ కు ఎంత రెమ్యూనరేషన్ ఉంటుందో కరెక్ట్ ఫిగర్ బయటకు వచ్చేలోపు మీరే అంచనా వేసుకోండి!

    

Tags:    

Similar News