చిత్రం : 'బబ్లీ బౌన్సర్'
నటీనటులు: తమన్నా - సౌరణ్ శుక్లా - అభిషేక్ బజాజ్ - సాహిల్ వైద్ - ప్రియం సాహా
సంగీతం: తనిష్క్ - బాగ్చే - కరణ్ మల్హోత్ర
నిర్మాతలు: పాక్స్ స్టార్ స్టూడియోస్ & జంగ్లీ పిక్చర్స్
దర్శకుడు: మధుర్ భండార్కర్
పద్నాలుగేళ్ల వయస్సులో హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా.. దక్షిణాదిలో దాదాపు అగ్ర హీరోలందరి సరసన నటించి స్టార్ హీరోయిన్ గా రాణించింది. కెరీర్ మొదలుపెట్టి ఇన్నేళ్ళయినా ఇప్పటికీ వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. అయితే బాలీవుడ్ లో సత్తా చాటాలనే ఆమె కోరిక మాత్రం తీరడం లేదు. ఇప్పటికే పలు హిందీ చిత్రాల్లో నటించిన తమన్నా.. అక్కడ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. అయినప్పటికీ హిందీ చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకోడానికి గట్టిగా ప్రయత్నాలు చేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ''బబ్లీ బౌన్సర్'' అనే హిందీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
తమన్నా ప్రధాన పాత్రలో ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మధుర్ బండార్కర్ తెరకెక్కించిన సినిమా ''బబ్లీ బౌన్సర్''. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో మహిళా బౌన్సర్ కథతో రూపొందిన మొట్టమొదటి సినిమా ఇదేనని ప్రచారం చేయడంతో.. అందరి దృష్టి దీనిపై పడింది. దీనికి తగ్గట్టుగానే ట్రైలర్ లో లేడీ బౌన్సర్ గా తమన్నా చలాకీగా కొత్తగా కనిపించడంతో ఆసక్తి రెట్టింపు అయ్యింది. ఈ చిత్రాన్ని థియేట్రికల్ స్కిప్ చేసి డైరెక్ట్ ఓటీటీ విధానంలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజ్ చేశారు. హిందీ సినిమా అయినప్పటికీ తెలుగుతో సహా పలు ఇతర భాషల్లో డబ్బింగ్ చేసి స్ట్రీమింగ్ కు పెట్టారు.
కథ విషయానికొస్తే.. బౌన్సర్స్ కు ప్రసిద్ధి చెందిన దిల్లీకి సమీపంలోని ఓ గ్రామంలో.. అందరూ పహిల్వాన్ల మాదిరిగా బాడీని బిల్డ్ చేస్తూ.. సిటీలో బౌన్సర్స్ గా స్థిరపడాలనే లక్ష్యంతో ఉంటారు. అయితే అబ్బాయిలకు ఏమాత్రం తక్కువ కాదనే వైఖరితో ఉండే అమ్మాయి బబ్లీ (తమన్నా).. తండ్రి ప్రోత్సాహంతో పహిల్వాన్ గా వ్యాయామాలు చేస్తూ ఉంటుంది. ఇది ఏమాత్రం ఇష్టపడని ఆమె తల్లి.. పెళ్లి చేసి బాధ్యత తీర్చుకోవాలని సంబంధాలు చూస్తోంది.
అయితే తన స్కూల్ టీచర్ కొడుకుని (అభిషేక్ బజాజ్) తొలి చూపులోనే ప్రేమించిన బబ్లీ.. వచ్చిన సంబంధాలను చెడగొడుతూ ఉంటుంది. అతనికి స్వతంత్రంగా బ్రతికే అమ్మాయిలంటే ఇష్టమని తెలుసుకుని జాబ్ చేసేందుకు సిద్ధపడుతుంది. ఇందులో భాగంగా అతనుండే ఢిల్లీకి వెళ్లాలని ప్లాన్ చేసిన బబ్లీ.. తనను ఇష్టపడే కుక్కు (సాహిల్ వైద్)తో పెళ్లికి సిద్ధమైనట్లు నాటకం ఆడుతుంది. ఈ క్రమంలో లేడీ బౌన్సర్ జాబ్ లో చేరిన బబ్లీ తను ప్రేమించినవాడి మనసు గెలుచుకుందా? బార్ లో పని చేసే ఆమె జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి? ఆమె జీవితం ఎలా సాగిందనేది మిగతా కథ.
తొలిసారి లేడీ బౌన్సర్స్ కథతో సినిమా అనగానే అందరిలో ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంది. ఇదేదో 'దంగల్' రేంజ్ లో ఉంటుందని ఊహించిన వారికి మాత్రం నిరాశే ఎదురవుతుంది. ఎందుకంటే ఈ సినిమాలో మహిళా బౌన్సర్ల గురించి కాకుండా.. బబ్లీ అనే బౌన్సర్ ప్రేమ కోణంలో జరిగే కథను చూపించారు. బబ్లీ ప్రేమించిన వ్యక్తి.. బబ్లీని ప్రేమించిన వ్యక్తుల మధ్య కథను వివరించింది. అయితే మహిళలు కూడా తమ కాళ్ళ మీద తాము నిలబడాలనే అంశాన్ని స్పృశించేలా దర్శకుడు ఈ చిత్రాన్ని తీర్చిద్దారు.
'బబ్లీ బౌన్సర్' సినిమా అంతా సాదాసీదాగా అనిపించే రొటీన్ సీన్స్ తో ఏమాత్రం ఆసక్తిని కలిగించకుండా సాగింది. ఒకటి రెండు చోట్ల తప్ప చెప్పుకోదగ్గ సీన్లు ఏమీ లేవు. ఎమోషనల్ కనెక్షన్ కూడా లేదు. చాందిని బార్ - ఫ్యాషన్ - కార్పొరేట్ - హీరోయిన్ వంటి విలక్షణ చిత్రాలతో జాతీయ అవార్డులు అందుకున్న డైరెక్టర్ మధుర్ భండార్కర్.. ఆయన్నుంచి ఏమాత్రం ఆశించిన ఓ సాధారణమైన సినిమాని అందించారని చెప్పాలి. అయితే ఓటీటీ సినిమా అయినప్పటికీ ఎక్కడా కూడా అసభ్యకరమైన డైలాగ్స్ మరియు అభ్యంతరకరమైన సన్నివేశాలు లేకుండా చూసుకున్నారు.
ఎంతో చలాకీగా హుషారుగా ఉండే బబ్లీ పాత్రలో తమన్నా మెప్పించింది. ఆమె నటనలోని మరో కోణాన్ని పరిచయం చేస్తుంది. కొన్ని సీన్స్ లో లేడీ బౌన్సర్ గా చూస్తాం కానీ.. అందులో ఆమె ప్రత్యేకత చాటుకోలేదనిపిస్తోంది. కాకపోతే సినిమా అంతా తమన్నా ఒక్కతే నడిపించిందని చెప్పాలి. మిగతా ప్రధాన పాత్రలు కూడా తమ పరిధి మేరకు నటించారు. టెక్నికల్ విషయాల గురించి గొప్పగా చెప్పుకోడానికి ఏమీ లేవు. ఓవరాల్ గా 'బబ్లీ బౌన్సర్' సినిమా సాగదీత సన్నివేశాలను స్కిప్ చేసుకుంటూ.. ఒకసారి ఓటీటీలో మాత్రమే చూడగలిగే సినిమా అని చెప్పాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.