స్విమ్ సూటులో ఎదలకు గాలం వేస్తున్న ఢిల్లీ సుందరి!!

Update: 2020-07-16 23:30 GMT
బాలీవుడ్ హీరోయిన్ మనీషా లంబా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఢిల్లీకి చెందిన ఈ భామ సిక్కు కుటుంబంలో జన్మించింది. ఇక తన పాఠశాల విద్యను చెన్నై చెట్టినాడ్ విద్యాశ్రమంలో తర్వాత శ్రీనగర్ లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్లో పూర్తిచేసింది. తర్వాత ఢిల్లీ విశ్వవిద్యాలయంలో తన గ్రాడ్యుయేషన్ పట్టా పొందింది. మనీషా ఢిల్లీలో చదివే టైంలోనే క్యాడ్బరీ, సోనీ, హజ్మోలా, ఎయిర్టెల్ వంటి బ్రాండ్ లకు మోడెలింగ్ చేసింది. అలా యాడ్స్ చేస్తుండగా క్యాడ్బరి షూట్ టైంలో డైరెక్టర్ సుజిత్ సర్కార్ 'యహ' మూవీలో అవకాశం ఇచ్చారు. ఇక అమ్మడు కాలేజీకి వెళ్తూనే సినిమా షూటింగులో పాల్గొనేది. తర్వాత మెల్లగా కార్పొరేట్, రాకీ, అంథోని కౌన్ హై.. సినిమాలలో సహాయక పాత్రలు చేసింది. అలా చేస్తుండగా 2008లో బచ్నా ఏ హసీనా, కిడ్నప్ సినిమాలు చేసింది. కిడ్నప్ సినిమాలోని పాత్ర మనీషాకు ప్రశంసలు తీసుకొచ్చింది.

తర్వాత 2009లో ఉత్తమ జాతీయ చిత్రంగా అవార్డు అందుకున్న 'వెల్ డన్ అబ్బ' సినిమా చేసింది. ఆ సినిమా మనీషాకు మంచిపేరు తెచ్చింది. తర్వాత 2014లో బిగ్ బాస్-8లో పాల్గొని టీవీ ప్రేక్షకులకు దగ్గరైంది. సినిమాలతో పాటు మనీషా మ్యూజికల్ వీడియోస్ కూడా చేసింది. అందులో ముఖ్యంగా హిమేష్ రేష్మియా 'తేరా సురూర్' పాటతో పాపులారిటీ సంపాదించింది. ఇక 2015లో ర్యాన్ థమ్ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది. ఇదిలా ఉండగా ఈ ముప్పై ఐదేళ్ల సుందరి ఇంకా స్లిమ్ ఫిగర్ మెయింటైన్ చేస్తోంది. సోషల్ మీడియాలో అరుదుగా కనిపించే ఈ భామ ఇటీవలే ఓ ఫోటో షేర్ చేసింది. ఆ ఫోటోలో అమ్మడు స్విమ్ సూట్ ధరించి స్విమ్మింగ్ పూల్ పై కూర్చొని నవ్వుతూ ఉంది. ఇక మనీషా నవ్వు చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. పెళ్ళైనా అమ్మడి అందాలు మాత్రం చూపరులను చూపు తిప్పుకోలేకుండా చేస్తున్నాయి. చిన్నదాని సోయగాలు కుర్ర ఎదలకు గాలం వేస్తున్నాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Tags:    

Similar News