శుృతిని ఏడిపించిన ఓ మినిష్టర్‌...

Update: 2015-04-08 03:30 GMT
అందాల శ్రుతిహాసన్‌ కుర్రాళ్ల గుండెల్లో గిలిగింతలు పెట్టి ఏడిపిస్తుంటే.. ఈ అమ్మడిని మాత్రం వేరొకరు ఏడిపిస్తున్నారు. తన సినిమాలో నటించాల్సిందే లేదంటే కోర్టు కేస్‌ ఫేస్‌ చేయి అని పివిపి వార్నింగ్‌ ఇవ్వడంతో శ్రుతికి ఏడుపొచ్చినంత పనైంది. ఆ సంఘటనను మరువక ముందే మరొక ఘటన.

మొన్ననే హైదరాబాద్‌ నుంచి తిరుపతి వెళుతుంటే ఏకంగా ఓ మంత్రి తెగ ఏడిపించాడట. అసలు శ్రుతిని ఎందుకు ఏడిపించారు? ఎలా ఏడిపించారు? అనేది ఆరాతీస్తే.. శ్రుతి హైదరాబాద్‌ నుంచి విమానంలో తిరుపతి పయణమైంది. అదే టైమ్‌లో ఓ ఏపీ మినిష్టర్‌ తనతో పాటే విమానం ఎక్కాడు. విమానాశ్రయంలో ప్రవేశించినప్పట్నుంచి అతగాడు ఫోన్‌లో మాట్లాడుతున్న తీరు శ్రుతికి విపరీతమైన విసుగు తెప్పించింది. పక్కనే ఎవరైనా ఉన్నారా? అనేది కూడా పట్టనట్టు సదరు మంత్రి బిగ్గరగా ఫోన్‌లో మాట్లాడుతుంటే శ్రుతి భరించలేకపోయింది. మింగలేక కక్కలేక ఇరుక్కుపోయింది. అసలే తన పక్క సీటులోనే కూచున్నాడాయే. వార్నింగులు పట్టించుకోడు. ఎవరి అసౌకర్యం పట్టదు. అయినా అంత పెద్దాయన్ని ఏమీ అనలేక బిక్కు బిక్కుమంటూ ఆ నస భరిస్తూనే కూచిందిట. ఓ రెండు సార్లు మంత్రిగారికి చెప్పాలని ప్రయత్నించింది. అయినా అతడు పట్టించుకోలేదు. ఆ తరువాతే అసలు కథ స్టార్ట్‌ అయ్యింది.

ఆయనకు ఏదో చెప్దామని ట్రై చేస్తే, నువ్వెవ్వరు నాకు చెప్పడానికి అంటూ బూతులు తిట్టేశాడట. దాంతో శ్రుతి కన్నీటి పర్యంతమైందని టాక్‌. మొత్తానికి అతగాడి ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేస్తే కానీ పరిస్థితి అదుపులోకి రాలేదట.

Tags:    

Similar News