కోలీవుడ్ హీరో విశాల్ తన లేటెస్ట్ మూవీ లాఠీ మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా కోసం కెరీర్ లో ఫస్ట్ టైం పోలీస్ ఆఫీసర్ గా నటించాలని అంటున్నారు విశాల్. సినిమా ప్రమోషన్స్ తో ఆసక్తికరమైన విషయాలను వెల్లడిస్తున్నారు. లాఠీ సినిమా అందరికి నచ్చే సినిమా అవుతుందని నమ్మకంగా చెబుతున్నారు విశాల్. తన కెరీర్ లో ఇదివరకు ఎప్పుడూ చేయని కథ, కథనాలతో ఈ సినిమా వస్తుందని అన్నారు విశాల్.
సమాజానికి పోలీస్ ఆఫీసర్స్ చాలా కీలకం.. అయితే వారి లైఫ్ లో కూడా కష్టాలు ఉంటాయి. అర్ధరాత్రి కూడా ఫోన్ వస్తే పరుగులు పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాంటి ఒక పోలీస్ ఆఫీసర్ కథే ఈ లాఠీ సినిమా. ఈ సినిమా అందరికి కనెక్ట్ అవుతుంది అన్న ఉద్దేశంతోనే పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్నామని అన్నారు విశాల్.
ఇక రాజకీయాల మీద తన అభిప్రాయాన్ని చెబుతూ.. రాజకీయం అంటే ప్రజా సేవ.. మనం చేసే పనిలోనే సమాజసేవ చేస్తుంటాం.. తుఫాన్ టైం లో తన స్నేహితులతో కలిసి సహాయం చేశాం. ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాలే అవసరం లేదని అన్నారు విశాల్.
మినిస్టర్ గా ఉదయనిధి స్టాలిన్ ప్రమోట్ అయ్యారు. తన కాలేజ్ మెట్ అయిన ఉదయనిధి స్టాలిన్ మినిస్టర్ అవడం సంతోషంగా ఉందని.. సినీ పరిశ్రమ అభివృద్ధికి అతను కృషి చేయాలని కోరుతున్నా అని అన్నారు. చెన్నైలో ఫిల్మ్ సిటీ ఏర్పాటు చేయాలి. అన్ని రాష్ట్రాల్లో ఫిల్మ్ సిటీలు ఉండగా చెన్నైలో లేకపోవడం బాధాకరం. అందుకే ఉదయనిధి స్టాలిన్ తమ ప్రభుత్వ సహకారంతో చెన్నైలో ఫిల్మ్ సిటీని ఏర్పాటు చేస్తే బాగుంటుందని అన్నారు విశాల్.
ఇక తను ఏపీ ఎలక్షన్స్ లో పోటీ చేస్తానని వచ్చిన వార్తలపై కూడా స్పందించారు విశాల్. ఆయన కుప్పం నుంచి వైసీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి. విశాల్ మాత్రం డైరెక్ట్ పాలిటిక్స్ మీద అంతగా ఆసక్తి లేదని చెప్పారు. ప్రజాసేవ చేయడానికి రాజకీయాలే కాదు తాము చేస్తున్న పనుల వల్ల కూడా ప్రజాసేవ చేయొచ్చని అంటున్నారు విశాల్.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.