న‌లుగురి ముందు బ‌ట్ట‌లిప్ప‌నని చెప్పా!

Update: 2022-02-23 00:30 GMT
స్ర్కిప్డ్ డిమాండ్ చేసినా.. స‌న్నివేశం ర‌క్తి  క‌ట్టాల‌న్నా  శృంగార స‌న్నివేశా లు స‌హ‌జం. హీరో-హీరోయిన్లు ఇంటిమేట్ సీన్స్ లో త‌ప్ప‌క న‌టించా ల్సిందే. రొమాంటిక్ యాంగిల్ లో బికినీ సీన్లు..పెద‌వి ముద్దుల్ని ఎప్పుడో దాటేసాం. ఇప్పుడు ట్రెండ్ అంతా ప‌బ్లిక్ రొమాన్స్ పండించ‌డ‌మే. వెబ్ సిరీస్ లు రాజ్య‌మేలుతోన్న రోజుల్లోకి వ‌చ్చేసాం. వెబ్ సిరీస్ ల్లో ఇప్పుడు శృంగార స‌న్నివేశాలు  స‌హ‌జంగా  మారిపోయాయి.

ఇక హాలీవుడ్ వెబ్ సిరీస్ ల గురించైతే చెప్పాల్సిన ప‌నిలేదు. ఇటీవ‌లే `యూఫోరియా` అనే వెబ్ సిరీస్ తో న‌టి మింకా కెల్లీ బాగా పాపుల‌ర్ అయింది. తాజాగా ఆ వెబ్ సిరీస్ అనుభ‌వాల్ని మింకా మీడియాతో పంచుకుంది. ఈ సీరిస్ కోసం డైరెక్ట‌ర్ నగ్నంగా న‌టించ‌మ‌ని అడిగారు. ఆ సీన్ ఎప్పుడు వ‌స్తుందో కూడా  చెప్పారు. సీన్ డిమాండ్ చేసింది కాబ‌ట్టి డైరెక్ట‌ర్ అలా అడ‌గ‌డం లో త‌ప్పు లేదు.

పాత్ర‌కు న్యాయం జ‌ర‌గాలంటే ఆయ‌న చెప్పిన‌ట్లు చేయాల్సిందే. అప్పుడే ఆ స‌న్నివేశం రక్తిక‌డుతుంది. కానీ నేను అంద‌రి ముందు బ‌ట్ట‌లు విప్ప‌నిన చెప్పాను. ఒంటిమీద బ‌ట్ట‌లుండగానే చేస్తాను అని చెప్పాను. అప్పుడు ఏమి అన‌లేదు. ఆ వెబ్ సిరీస్ రిలీజ్ త‌ర్వాత నాకెంతో పేరు వ‌చ్చిందో చెప్పాల్సిన ప‌నిలేదు. ఇక్క‌డ అర్ధం చేసుకోవాల్సింది న‌న్ను కాదు. ద‌ర్శ‌కుడ్ని. అత‌ను నా గురించి ఆలోచించి రాజీకి వ‌చ్చారు.

అంత అవ‌స‌రం ఆయ‌న‌కి లేదు. నేను కాక‌పోతే ఇంకో న‌టి వ‌చ్చి న‌గ్నంగా న‌టిస్తుంది. కానీ డైరెక్ట‌ర్ హీరోయిన్ మాట‌కు విలువనిచ్చి  నాకు స‌హ‌క‌రించారు` అని తెలిపింది. కొంత మంది మేక‌ర్స్ అస్స‌లు మాట విన‌రు. తాము ప‌ట్టిన కుందేలుకి మూడే కాళ్లు అన్న‌ట్లు భీష్మించుకుని కూర్చుంటారు. అలాంట‌ప్పుడు న‌లుగురిలో ఉన్నా..న‌ల‌భై మందిలో ఉన్నా అత‌ను చెప్పిన‌ట్లు చేయాల్సిందే.

లేదంటే  ప్రాజెక్ట్ నుంచి ఎగ్జిట్ అవుతాం. ద‌ర్శ‌కులంతా కూడా హీరోయిన్ల వైపు నుంచి కూడా ఆలోచించాల‌ని కోరుకుంటున్న‌ట్లు మింకా తెలిపింది. హాలీవుడ్ లో  ఇలాంటి మేక‌ర్ ఉండ‌టం గొప్ప విష‌యం అంటూ నెటి జ‌నులు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.  ఇండియాలో కాస్టింగ్ కౌచ్ పై ఎలాంటి  ఉద్యమాలు తెర‌పైకి వ‌చ్చాయో తెలిసిందే.

ఈ క్రమంలో ఎంతో మంది ద‌ర్శ‌క‌లు..నిర్మాత‌లు..హీరోల పేర్లు తెర‌పైకి వ‌చ్చాయి.  దేశ వ్యాప్తంగా `# మీటూ ఉద్య‌మం` ప‌తాక స్థాయిలో జ‌రిగింది. అయినా ఇంకా రోజు ఏదో ఒక న‌టి కాస్టింగ్ కౌచ్ పై ఆరోప‌ణ‌లు చేస్తూనే ఉన్నారు.
Tags:    

Similar News