తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఎంతో సెంటిమెంట్ తో కూడుకున్నది. ప్రతి సందర్భానికి మంచి ముహూర్తం తప్పనిసరి. సినిమా ప్రారంభం దగ్గర నుంచి రిలీజ్ అయ్యే వరకూ అన్ని మంచి ముహూర్తం ఫిక్స్ చేసుకుని అంతా మంచి జరగాలని ముందుగానే డేట్లు ఫిక్స్ చేసుకుని పెట్టుకుంటారు. సెంటిమెంట్ ప్రకారం టీమ్ ముందుకు వెళ్తుంది. కోట్లాది రూపాయల పెట్టుబడితో కూడిన వ్యవహారం కాబట్టి అంతే జాగ్రత్తగా వ్యవరిస్తారు. సింగిల్ మిస్టేక్ కూడా ఎక్కడా దొర్లకుండా జాగ్రత్తపడతారు. పొరటపాటున జరగకూడనిది జరిగితే అదో అశుభంగా భావిస్తారు. ఇక్కడ సెంటిమెంట్.. దేవుళ్ల పై నమ్మకం అనేది ఆ స్థాయిలో ఉంటుంది.
తాజాగా నాగచైతన్య కథానాయకుడిగా నటించిన `లవ్ స్టోరీ` విషయంలో జరిగిన తప్పిదం ప్రముఖంగా చర్చల్లోకొచ్చింది. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 10న సినిమా రిలీజ్ చేస్తున్నట్లు యూనిట్ అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేసింది. అయితే పోస్టర్ లో ఏకంగా దేవుడు పేరునే తప్పుగా వేసారు. వినాయక బదులుగా `వినకాయ్` అని అచ్చు తప్పు ప్రత్యక్షమైంది. ఇది స్పెల్లింగ్ మిస్టేక్. ఓవర్ లుక్ లో దొర్లిన తప్పు. కానీ నెటిజనులు దీన్నీ అశుభ సూచికగా భావిస్తూ కామెంట్లు పోస్ట్ చేయడంతో అవి వైరల్ గా మారాయి. దేవుడి పేరునే తప్పు గా రాశారు. ఇది సినిమాకు ప్రతికూల అంశం. అందుకే అలా తప్పు జరిగింది. తెలియకుండా తప్పు జరిగినా దైవం ప్రమేయం లేకుండా అలా జరగదు కదా! అని కొందరు కామెంట్లు చేసారు. ఇంకొందరు సినిమా రిలీజ్ చేయకూడదంటూ కామెంట్లు చేసారు. ఇలా ఎవరి స్టైల్లో వారు చెలరేగిపోయారు. అయితే దేవుళ్లు సెంటిమెంట్ల దృష్ట్యా డిజైనర్ల అప్రమత్తత చాలా ముఖ్యం. తప్పు దొర్లాక దానిని సరి చేసుకోవడం క్లిష్ఠమైన ప్రక్రియ. ఇలాంటివి ఇకపై రిపీట్ కాకూడదనే ఆశిద్దాం.
ప్రస్తుతానికి యూనిట్ వెంటనే ఆ పోస్టర్ ని తొలగించి తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేసింది. మొత్తానికి లవ్ స్టోరీ సెప్టెంబర్ 10 న రిలీజ్ కి రావడం ఖరారు అయ్యింది. ఇది అభిమానులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. చాలా కాలం తర్వాత పెద్ద హీరో సినిమా నేరుగా థియేటర్లో రిలీజ్ అవుతోంది. ఈ చిత్రానికి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. ఇందులో చైతూ సరసన సాయి పల్లవి నటించింది.