ఈకలు పీకటం మొదలైంది. ట్రెండింగ్ లో ఉన్న విషయాలపై తమకున్న మేథోతనాన్ని ప్రదర్శించటం ఈ మధ్యన ఎక్కువైంది. ఇందుకు సోషల్ మీడియా అందుబాటులో ఉండటంతో చాలా విషయాల మీద ఎవరికి వారు చెలరేగిపోతున్నారు. ఇప్పుడు వార్తల్లో ప్రముఖంగా కనిపిస్తూ.. వినిపిస్తున్న అంశం.. సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్న అంశం ఏమిటంటే.. బాహుబలి2 ట్రైలర్ గురించే. ఈ క్రేజీ సినిమాకు సంబంధించిన ప్రతి అంశం ఇప్పుడు అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది. మొనగాడు లాంటి సినిమాల రికార్డుల్ని సింఫుల్ గా బీట్ చేసేసి దూసుకెళుతున్న ఈ ట్రైలర్ మీద కొత్త చర్చ మొదలైంది.
రోజు వ్యవధిలోనే 2.22 కోట్ల యూట్యూబ్ వ్యూస్ వచ్చిన బాహుబలి 2 ట్రైలర్ క్రేజ్ చూస్తే.. ఈ సినిమా కలెక్షన్లు మరెంత భారీగా ఉండనున్నాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే.. హైఎండ్ గ్రాఫిక్స్ తో.. విజువల్ వండర్ గా మారిన బాహుబలి ట్రైలర్ లో భాషా సమస్యలు ఉన్నట్లుగా ఇప్పుడు చెబుతున్నారు. అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకునే జక్కన్న.. డైలాగ్ విషయంలో తప్పులు దొర్లేలా ఉండటం ఏమిటన్నది కొందరి ప్రశ్న.
ఇంతకీ వారు లేవనెత్తుతున్న విషయం ఏమిటంటే.. ట్రైలర్ లో కట్టప్పతో బాహుబలి చెప్పే డైలాగ్ ఒకటుంది. అందులో.. "నువ్వు నా పక్కన ఉన్నంత వరకు..నన్ను చంపే మగాడు ఇంకా పుట్టలేదు మామా" అని. ఈ డైలాగ్ లో భయంకరమైన వ్యాకరణ దోషం ఉందన్నది కొందరు భాషాభిమానుల వాదన.
వారు చెప్పేదేమంటే.. నువ్వు నా పక్కన ఉన్నంతవరకు అన్నది వర్తమానమైతే.. చంపే మగాడు పుట్టలేదు మామ అనేది గడిచి పోయిన భూతకాలం అవుతుందని.. వాస్తవానికి డైలాగ్ ఉండాల్సింది.. నన్ను చంపే మగాడు పుట్టబోడు మామ అని ఉండాలని.. ఇలాంటి తప్పుల్ని పట్టించుకోకపోవటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. వ్యాకరణం పరంగా తప్పు అయినప్పటికీ.. మరీ.. ఈకలు పీకుతున్నట్లుగా ఉందన్న చురకలు పడుతున్నాయి. మరికొందరు.. నిజమే కదా అంటూ రియాక్ట్ అవుతుండటం గమనార్హం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/