కోహ్లీ పెటర్నటీ లీవ్‌ పై విమర్శలు

Update: 2020-11-10 17:10 GMT
టీం ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ త్వరలో జరుగనున్న ఆసీస్ టూర్‌ కు వెళ్లడం లేదు. బిసీసీఐ వద్ద పెటర్నటీ లీవ్‌ కోసం అప్లై చేసుకున్నాడు. అతడికి బిసీసీఐ లీవ్‌ ను మంజూరు కూడా చేసింది. కోహ్లీ భార్య అనుష్క శర్మ ప్రస్తుతం ప్రెగ్నెంట్‌ అనే విషయం తెల్సిందే. ఆమె డెలవరీ సమయంలో కోహ్లీ పక్కనే ఉండాలని కోరుకుంటున్నాడు. అందుకే ఆయన సెలవు తీసుకున్నాడు. కీలకమైన ఆసీస్‌ టూర్‌ కు కోహ్లీ దూరంగా ఉండటం పట్ల అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కోహ్లీ లేకుండా ఆసీస్‌ టూర్‌ ఖచ్చితంగా అంత ఈజీ కాదు. ఆ విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. తాను లేకుండా ఆసీస్‌ టూర్‌ చాలా కష్టం అంటూ కోహ్లీకి కూడా తెలుసు. దేశం కోసం ఆడాల్సింది పోయి ఈ సమయంలో భార్య పక్కన ఉండాలనుకోవడం పై కొందరు విమర్శలు చేస్తున్నారు.

ధోని తన భార్య సాక్షి ప్రెగ్నెంట్‌ గా ఉన్న సమయంలో కూడా మైదానంలోనే ఉన్నాడు. సాక్షి ఫిబ్రవరి 6 2015న జీవాకు జన్మనిచ్చిన సమయంలో ధోని వరల్డ్‌ కప్‌ టోర్నమెంట్ ఆడుతున్నాడు. దేశం తరపున ఆడుతుండటంతో కొన్ని వ్యక్తిగత విషయాలను త్యాగం చేయాల్సి వస్తుంది అంటూ ధోని పలు సందర్బాల్లో చెప్పుకొచ్చాడు. జీవా పుట్టిన సమయంలో ఆ మదుర అనుభూతిని మీరు మిస్‌ అయ్యారు కదా అంటూ ప్రశ్నించగా దేశం తరపున ఆడుతున్నప్పుడు కొన్ని తప్పవు అంటూ ధోని సింపుల్‌ గా సమాధానం చెప్పాడు. ఇప్పుడు ఆ మాటలను కోహ్లీకి వినిపించేలా నెటిజన్స్‌ ధోనీ వీడియోలను షేర్‌ చేస్తున్నారు. కోహ్లీ ఇంకా హుందాగా దేశం కోసం అన్నట్లుగా ఆడాలంటూ క్రికెట్‌ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇదే సమయంలో కొందరు కోహ్లీ అభిమానులు మాత్రం ఆ రోజు ధోని ఉన్నది వరల్డ్‌ కప్‌ టోర్నమెంట్‌. అది చాలా కీలకమైన టోర్ని. కాని ఇప్పుడు కేవలం ఆసీస్‌ జట్టుతో జరగబోయే సిరీస్‌. కనుక ఈ విషయాన్ని ఆ విషయాన్ని అస్సలు పోల్చవద్దంటూ కోహ్లీ అభిమానులు కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దేశం కోసం ఆడినంత మాత్రాన వ్యక్తిగత జీవితం మొత్తం త్యాగం చేయాల్సిన అవసరం లేదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొందరు సీనియర్లు కూడా కోహ్లీకి మద్దతు తెలుపుతుంటే మరికొందరు మాత్రం విమర్శలు చేస్తున్నారు.
Tags:    

Similar News