గ్రేట్ : గోల్డెన్ గ్లోబ్ వేదికపై నుండే అందరికీ క్రెడిట్ ఇచ్చిన పెద్దన్న
మన నాటు నాటు అంతర్జాతీయ స్థాయి అవార్డ్ గోల్డెన్ గ్లోబ్ ను దక్కించుకోవడం తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కాకుండా ఇండియన్ సినీ పరిశ్రమకే గర్వకారణం. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు సాంగ్ కు గాను సంగీత దర్శకుడు కీరవాణి ఈ అవార్డును అందుకున్నాడు. అవార్డును అందుకున్న సమయంలో ఆయన మాట్లాడిన రెండు నిమిషాల మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
అవార్డ్ వచ్చిన సమయంలో కొందరు అత్యుత్సాహంతో మాట్లాడుతూ ఉంటారు. కానీ కీరవాణి మాత్రం తన భార్య మొదలుకుని పాటకు వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా క్రెడిట్ ఇవ్వడం జరిగింది. సింగర్ తో పాటు పాటకు ప్రొగ్రాం చేసిన వారికి కూడా అంత పెద్ద స్టేజ్ పైగా క్రెడిట్ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు.
ఈ అవార్డును తన భార్య శ్రీవల్లితో కలిసి షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని.. ఆమె ముందు ఈ అవార్డును తీసుకోవడం చాలా సంతోషంగా ఉందని కీరవాణి చెప్పాడు. అలాగే ప్రియారిటీని బట్టి ఈ అవార్డు వారికి దక్కాలి అంటూ రాజమౌళి.. ప్రేమ్ రక్షిత్ మాస్టర్.. కాల భైరవ.. రాహుల్ సిప్లిగంజ్.. చంద్రబోస్ మరియు రామ్ చరణ్.. ఎన్టీఆర్ ల పేర్లను కీరవాణి ప్రస్తావించాడు.
నాటు నాటు కు వర్క్ చేసిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన అంతర్జాతీయ వేదికపై ప్రస్తావించడం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా గౌరవం.. గొప్ప గుర్తింపు దక్కినట్లు అయ్యింది. కీరవాణి అందరికీ క్రెడిట్ ఇవ్వడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సుదీర్ఘ సంగీత ప్రస్థానంలో కీరవాణి దక్కించుకున్న అత్యున్నత పురస్కారం ఇదే.. దీనిని ఇతరులతో షేర్ చేసుకోవడం గొప్ప విషయం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.