డిసెంబర్ 31న ఖుషి రీ రిలీజ్ హంగామా మొదలైంది. తెలుగు రెండు రాష్ట్రాల్లో ఈ సినిమా హడావిడి చూస్తుంటే ఇప్పుడే ఈ సినిమా రిలీజ్ అవుతున్న జోరు కొనసాగుతోంది. ఖుషి సినిమా రీ రిలీజ్ సందర్భంగా ఆ సినిమా నిర్మాత ఏ.ఎం రత్నం సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
ఖుషి సినిమా ముందు తమిళంలో తీసి ఆ తర్వాత తెలుగులో రీమేక్ చేశారు. కానీ అసలు విషయం ఏంటంటే ఈ సినిమా ముందు తెలుగులో పవన్ కళ్యాణ్ తోనే తీయాలని అనుకున్నారట. అమీషా పటేల్ హీరోయిన్ గా ఎస్.జె సూర్య డైరెక్షన్ లో సినిమా ఓపెనింగ్ కూడా చేశారట.
కానీ ఆ టైం లో పవన్ బద్రి సినిమా బిజీలో ఉండటం వల్ల సూర్య తమిళం లో విజయ్ తో ఈ సినిమా పూర్తి చేశారు. అంతేకాదు ఈ సినిమాకు ముందు టైటిల్ గా ముద్దు అని అనుకున్నారట. కాకపోతే ఆ టైటిల్ తో మహిళలు టికెట్ తీసుకునేందుకు ఇబ్బంది పడతారని నిర్మాత ఏ.ఎం రత్నం మరో టైటిల్ ఆలోచించమని చెప్పగా ఖుషి అని ఫిక్స్ చేశారట. అలా తమిళ సినిమాకు పెట్టిన టైటిల్ నే తెలుగు సినిమాకు పెట్టేశారట.
ఇక బద్రి పూర్తి చేశాక పవన్ తో ఖుషి చేస్తుండగా అమీషా పటేల్ హిందీలో బిజీ అవడంతో అప్పుడే యువకుడు సినిమాతో పరిచయమైన భూమికని హీరోయిన్ గా తీసుకున్నామని అన్నారు. తనకు తెలిసి అప్పట్లోనే ఇండియన్ సూపర్ స్టార్స్ ఇద్దరని చెప్పానని అందులో ఒకరు రజినీకాంత్ కాగా.. మరొకరు పవన్ కళ్యాణ్ అని అప్పుడే చెప్పానని అన్నారు ఏ.ఎం రత్నం. ఈ ఇద్దరికి ఆడియన్స్ పల్స్ బాగా తెలుసు.. వారి సినిమాలు ఎలా ఉండాలో వారికి తెలుసని అన్నారు ఏ.ఎం రత్నం.
ఖుషి రీ రిలీజ్ హంగామా టైం లో ఏ.ఎం రత్నం కామెంట్స్ సినిమాకు మరింత బూస్టింగ్ ఇస్తున్నాయి. పవర్ స్టార్ ఫ్యాన్స్ అంతా కూడా ఖుషి వేడుక చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఏ.ఎం రత్నం పవన్ కళ్యాణ్ తో హరి హర వీరమల్లు సినిమా చేస్తున్నారు.
ఆ సినిమాని కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది. క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా లో నిధి అగర్వాల్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.