అనుమానాస్పద రీతిలో ఒక ప్రముఖ మోడల్ మరణించారు. తన గదిలో ఆత్మహత్య చేసుకున్నట్లుగా చెబుతున్న ఈ ఉదంతంలోకి వెళితే.. అహ్మదాబాద్ కు చెందిన 27ఏళ్ల ఖుష్బుభట్ ఆత్మహత్య ఇప్పుడు సంచలనంగా మారింది. ప్రముఖ టీవీ యాంకర్ గా సుపరిచితురాలైన ఆమె.. జోధ్ పూర్ లోని సుకేతు టవర్ లోని తన రూమ్ లో ఫ్యాన్ కు ఉరి వేసుకున్నట్లు గుర్తించారు. ఆదివారం మధ్యాహ్నం ఆమె భోజనం చేసిన అనంతరం ఆత్మహత్య చేసుకున్నట్లుగా భావిస్తున్నారు. ఈ విషయం ఆలస్యంగా సోమవారం వెలుగులోకి వచ్చింది. ఆమె ఆత్మహత్యకు కారణాల్ని ఆరా తీస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు.
ఆత్మహత్య చేసుకున్న చోట.. ఎలాంటి సూసైడ్ లెటర్ లభించలేదని తెలుస్తోంది. 92 ఏళ్ల అమ్మమ్మ.. 59 ఏళ్ల తండ్రితో కలిసి నివసిస్తున్న ఖుష్బూ.. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారన్నది అర్థం కాని ప్రశ్నగా మారింది. భోజనం పెట్టే సమయంలో.. తాను డయాబెటిక్ అని.. ఎక్కువ అన్నం ఎందుకు పెడుతున్నావంటూ అన్నందుకు ఆమె డిప్రెషన్ కు గురై.. ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని చెబుతున్నారు.
తన గదిలోకి వెళ్లిన ఆమె.. తాళం వేసుకుందని.. సోమవారం మధ్యాహ్నానికి కూడా బయటకు రాకపోవటంతో అనుమానం వచ్చి.. ఇరుగుపొరుగువారిని సాయం కోరగా.. వారు వచ్చి చూడగా.. ఖుష్బూ ఫ్యాన్ కు ఉరి వేసుకున్నట్లు గుర్తించారు. ఖుష్బూ సోదరుడు ఆస్ట్రేలియాలో ఉంటారని.. ఆయన వచ్చిన వెంటనే అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు చెబుతున్నారు. వర్థమాన మోడల్ సూసైడ్ కు పాల్పడటం ఇప్పుడు సంచలనంగా మారింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/